న్యూ ఢీల్లీ: భారతదేశంలోని ప్రధాన మార్కెట్లలో ఈ దీపావళికి సుమారు 72వేల కోట్ల రూపాయల అమ్మకాలు నమోదయ్యాయని ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) ఆదివారం (నవంబర్ 15) తెలిపింది.

సిఐఐటి ప్రకారం, ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా చైనా వస్తువులను విక్రయించవద్దని, చైనా వస్తువులని బహిష్కరించాలని సిఐఐటి పిలుపునిచ్చింది.

"భారతదేశంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుగా పరిగణించే 20 వేర్వేరు నగరాల నుండి సేకరించిన నివేదికల ప్రకారం, దీపావళి పండుగ అమ్మకాలు సుమారు 72వేల కోట్లు అని, చైనాకు 40వేల కోట్ల రూపాయల న‌ష్టం జ‌రిగినట్లు" సిఐఐటి ఒక ప్రకటనలో తెలిపింది.

also read రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చేతికి ఆన్‌లైన్‌ ఫర్నిచర్‌ స్టోర్‌.. రూ.182 కోట్లకు 96% వాటా కొనుగోలు... ...

ఈ సర్వే కోసం ఢీల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్, రాయ్‌పూర్, భువనేశ్వర్, రాంచీ, భోపాల్, లక్నో, కాన్పూర్, నోయిడా, జమ్మూ, అహ్మదాబాద్, సూరత్, కొచ్చిన్, జైపూర్, చండీఘడ్‌తో సహా 20 నగరాలను  డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుగా  సిఐఐటి పరిగణించింది.  

దీపావళి పండుగ సీజన్లో వాణిజ్య మార్కెట్లలో జరిగిన బలమైన అమ్మకాలు భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను సూచిస్తాయని ఐఐటి తెలిపింది.

ఎఫ్‌ఎంసిజి వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బొమ్మలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు -వస్తువులు, వంటగది సామగ్రి- ఉపకరణాలు, గిఫ్ట్ వస్తువులు, స్వీట్లు, గృహోపకరణాలు, వస్త్రాలు, బంగారం, బంగారు ఆభరణాలు, చెప్పులు, గడియారాలు, ఫర్నిచర్, ఫిక్చర్స్, ఫ్యాషన్ దుస్తులు, ఇంటి అలంకరణ వస్తువులు వంటివి  దీపావళిలో ఎక్కువగా కొనుగోలు చేసిన ఉత్పత్తులలో ఉన్నాయి.

దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని సిఐఐటి ప్రచారం నిర్వహిస్తోందని గమనించాలి. ఈ ఏడాది జూన్‌లో చైనా, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో సి‌ఐ‌ఏ‌టి అన్ని చైనా కంపెనీల ఉత్ప‌త్తుల‌పై సీఏఐటీ నిషేధం విధించింది.