రూ.6 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ 5 బ్రాండ్ కార్లు ఇవిగో

భారతదేశంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో అవసరాలకు తగ్గట్టుగా కార్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్ లో లభించే బెస్ట్ 5 కార్ల గురించి తెలుసుకుందాం రండి. 

Top 5 BudgetFriendly Cars Similar to Maruti Alto K10 Price sns

సాధారణంగా బడ్జెట్ కారు అనేసరికి అందరికీ గుర్తొచ్చే కారు మారుతి ఆల్టో K10. చిన్న డిజైన్, అవసరమైన ఫీచర్లు ఉండటంతో ఈ కారుకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.5.54 లక్షలు ఉంది. ఇదే ధరలో ఇతర కంపెనీల కార్లు కూడా ఉండాయి. వాటి డీటైల్స్ తెలుసుకుందాం రండి. 

మారుతి వ్యాగన్ R

మారుతి వ్యాగన్ R చిన్న డిజైన్ కలిగిన తక్కువ ధరలో లభించే కారు. ఇది ప్రత్యేకంగా తక్కువ బడ్జెట్ లో కారు కొనాలనుకొనే వారి కోసం తయారైంది. దీని ధర మార్కెట్లో రూ.5.54 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు నగరంలో చిన్న చిన్న అవసరాలు తీర్చుకొనేందుకు బాగా ఉపయోగపడుతుంది. లాంగ్ డ్రైవ్స్ కి కూడా వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కారులోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంఫర్ట్ గా కూర్చోడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.  ఇది చిన్న కుటుంబాలకు సౌకర్యవంతంగా, బడ్జెట్ లో లభించే కారు.  

Top 5 BudgetFriendly Cars Similar to Maruti Alto K10 Price sns

మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న కారు. దీని ధర రూ.6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. నడపడానికి చాలా సౌకర్యవంతంగా ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్ని ఇష్టపడతారు. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ NCAP ద్వారా 1-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది ఐదు వేర్వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ AC, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్-బటన్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

టాటా పంచ్

ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా పంచ్. దీని ధర రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అందువల్ల పల్లెలు, పట్టణాల్లో కూడా దీని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీని స్టైలిష్ లుక్ కూడా ఈ కారు ప్రత్యేకతను తీసుకొచ్చింది. కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ తో ఈ కారు లభిస్తుండటంతో ఎక్కువమందికి ఈ కారు నచ్చింది. 

హ్యుందాయ్ గ్రాండ్ i10

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఒక అద్భుతమైన, సౌకర్యవంతమైన చిన్న కారు. దీని ధర రూ.5.92 లక్షల నుండి ప్రారంభమవుతుంది.  హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఐదు వేర్వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌ రెండు రకాలుగా మీరు ఉపయోగించొచ్చు. 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక వెంట్‌లతో కూడిన ఆటో AC, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్‌లైట్లు, పుష్ బటన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 

టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజా అనేది ఒక అద్భుతమైన మరియు స్టైలిష్ చిన్న కారు, ఇది జపనీస్ కంపెనీ టయోటాచే తయారు చేయబడింది. దీని ధర రూ.6.86 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు అద్భుతమైన మైలేజ్ మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంది. 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMTతో వస్తుంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్ కూడా ఉంది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెన్స్, హెడ్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వెనుక AC వెంట్‌లతో కూడిన ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: https://telugu.asianetnews.com/gallery/business/maruti-suzuki-fronx-review-style-power-and-budget-friendly-car-sns-sp3zeg 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios