Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌కు షాక్: వారంలో రూ.1.30 లక్షల కోట్ల లాస్

రూపాయి పతనం, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రభావంపై ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనాలతో వాల్ స్ట్రీట్.. దాని వెంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో వివిధ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. తొలి ఐదు రోజుల్లో ఈ వారంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూచిప్ స్టాక్ రిలయన్స్ భారీగా నష్టాన్ని చవి చూసింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,32,061.4 కోట్లు పతనమై రూ.6,65,441.16 కోట్ల వద్ద స్థిర పడింది.

Top 10 firms lose Rs 2,55,995 crore in m-cap; RIL worst hit
Author
New Delhi, First Published Oct 12, 2018, 12:42 PM IST

న్యూఢిల్లీ: రూపాయి పతనం, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రభావంపై ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనాలతో వాల్ స్ట్రీట్.. దాని వెంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో వివిధ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. తొలి ఐదు రోజుల్లో ఈ వారంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూచిప్ స్టాక్ రిలయన్స్ భారీగా నష్టాన్ని చవి చూసింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,32,061.4 కోట్లు పతనమై రూ.6,65,441.16 కోట్ల వద్ద స్థిర పడింది. పది అగ్రశ్రేణి స్టాక్స్ కూడా భారీగా రూ.2,55,995 కోట్ల మేర పతనం అయ్యాయి. ఈ వారంలో టాప్ 10 స్టాక్స్ 1850.15 పాయింట్ల నష్టాన్ని చవి చూశాయి. 

తర్వాతీ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్టాక్ రూ.31,164.6 కోట్లు నష్టపోయి ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,05,187.65 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐఎంఎఫ్సీ మేజర్ ఐటీసీ రూ.23,932.94 కోట్ల నష్టంతో రూ.3,39,284.67 కోట్ల వద్ద స్థిరపడింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం నష్టపోయింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ రూ.17,091.72 కోట్లు నష్టపోయి రూ.2,00,874.28 కోట్ల వద్ద నిలిచింది. దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా షేర్ రూ.13,821.67 కోట్ల మేరకు నష్టపోయి రూ.2,08,223.79 కోట్ల వద్ద ముగిసింది. 

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ రూ.11,629.51 కోట్ల నష్టంతో మార్కెట్ కేపిటలైజేషన్ రూ.5,33,340.93 కోట్ల వద్ద స్థిరపడగా, హిందూస్థాన్ యూనీ లీవర్ వాటా రూ.10,433.61 కోట్ల నష్టంతో ఆ సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ 3,37,566.18 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ వాటా రూ.6,812.89 కోట్ల నష్టంతో దాని మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2,30,075.87 కోట్లకు పతనమైంది. మరో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2,621.03 కోట్లు పతనమై రూ.3,15,331.73 కోట్ల వద్ద స్థిర పడింది. గురువారం వరకు టాప్ 10 షేర్లలో టీసీఎస్ మొదటి స్థానంలో నిలువగా, తర్వాతీ స్థానంలో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, మారుతి సుజుకి ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios