Tomato Price : టమాటా పండించిన రైతుకు జాక్‌పాట్, ఒక్క రోజులో 38 లక్షల సంపాదన...?

టమాటా ధరలు అన్ని రికార్డులను చెరిపి వేస్తున్నాయి ఒకప్పుడు టమాటా ధర చూసి కన్నీళ్లు పెట్టుకున్న రైతులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటను విక్రయించి ఏకంగా 38 లక్షల రూపాయలు సంపాదించిన ఘటన వైరల్ గా మారింది.

Tomato Price : Jackpot for the farmer who grows tomato, 38 lakhs in one day MKA

కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం మంగళవారం ఏపీఎంసీ మార్కెట్‌లో రూ.38 లక్షలకు 2 వేల టమాట బాక్సులను విక్రయించి మార్కెట్‌లో రికార్డు సృష్టించింది. కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా బేతమంగళకు చెందిన ప్రభాకర్ గుప్తా, అతని సోదరులు మంగళవారం 15 కేజీల బాక్సును రూ.1900 చొప్పున విక్రయించారు.  కాగా ఈ సీజన్ లో 15 కేజీల టమాటా బాక్స్ గరిష్టంగా రూ.2200 పలికింది. కానీ బుధవారం అదే బాక్స్ గరిష్ట ధర రూ.1800 ఉంది.

బేతమంగళలోని 40 ఎకరాల పొలంలో గుప్తా, అతని సోదరులు గత 40 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులపై మంచి అవగాహన ఉండడం వల్లే నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నామని ప్రభాకర్ సోదరుడు సురేష్ వివరించారు. రెండేళ్ల క్రితం కూడా గుప్తా కుటుంబానికి టమాటకు మంచి ధరలు లభించాయి. అప్పట్లో 15 కిలోల టమాట పెట్టెను రూ.800కు విక్రయించింది. అనంతరం 2.5 ఎకరాల్లో టమాట సాగు చేశారు. ఒక ఎకరంలో టమోటా సాగు చేసేందుకు దాదాపు రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది. తాను 2.5 ఎకరాల్లో 300 బాక్సుల టమాటా పండిస్తున్నాను అని వివరించారు.

దేశంలోనే రెండో అతిపెద్ద టమాటా మార్కెట్‌గా ఉన్న కోలార్‌ ఏపీఎంసీ మార్కెట్‌లో 15 కిలోల టమాటా పెట్టె గరిష్టంగా రూ.2200 పలికింది. గతంలో కోలార్ నుంచి రోజూ 8,000 మెట్రిక్ టన్నుల టమోటాలు సరఫరా అయ్యాయి . ఇప్పుడు 1,000 మెట్రిక్ టమోటాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. కేఆర్‌ఎస్‌ మండి యజమాని చట్రకోడిహళ్లి ఆర్‌.సుధాకర్‌  మాట్లాడుతూ... 4-5 సంవత్సరాల క్రితం కరోనా కంటే ముందు, టమోటా బాక్స్ 1600 రూపాయలు పలికింది. కానీ ప్రస్తుత ధర అత్యధికం అని పేర్కొన్నారు. మంగళవారం నాటి రేటు గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని ఆయన చెప్పారు. కోలారులో టమాటా దొంగతనాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కోలూరులో టమాటా రైతులు పగలు అనే తేడా లేకుండా పొలాల్లో కాపలా కాస్తున్నారు.

టమాటా కేజీ రూ. 300 కు చేరే చాన్స్....

దేశ వ్యాప్తంగా పెరిగిన టమాటా ధర రానున్న రోజుల్లో కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  దీని గురించి నేషనల్ కమోడిటీ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిఎంఎల్) చీఫ్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. 'జూన్ ప్రారంభంలో కిలో 40 ఉందని, జూలై మొదటి వారంలో టమాటా ధర రూ.100 కాగా,  కొన్ని ప్రాంతాల్లో 200 దాటింది. దీనికి ప్రధాన కారణం దేశంలోని ఉత్తర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు. దీంతో అపారమైన పంట నష్టం వాటిల్లుతుందన్నారు.

మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రల్లో వైరస్‌ సోకడంతో పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కొన్ని చోట్ల విపరీతమైన ఎండలకు పంటలు నాశనమయ్యాయి. ఇదిలావుంటే భవిష్యత్తులో పండించిన పంటకు సరైన ధర వస్తుందో లేదో తెలియక చాలా మంది రైతులు నాట్లు వేయడం లేదు. ఈ కారణాలన్నింటి వల్ల రానున్న రోజుల్లో దేశంలో టమాటా ధర రూ.300కి చేరనుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios