Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 3వ రోజు రికార్డు కూడా స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ .. బ్యాంకింగ్‌ షేర్లలో లాభాలు..

ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివరి రికార్డు స్థాయిలో ముగిసింది. 221.52 పాయింట్ల (0.42 శాతం) లాభంతో సెన్సెక్స్ 52,773.05  ముగియగా, మరోవైపు నిఫ్టీ 57.40 పాయింట్లు ( 0.36 శాతం) లాభంతో 15,869.25 వద్ద ముగిసింది. 

todays stock market sensex nifty share market close today latest news 15 june 2021 closing indian benchmark ended higher
Author
Hyderabad, First Published Jun 15, 2021, 4:56 PM IST

నేడు స్టాక్ మార్కెట్  వారంలోని రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్  సెన్సెక్స్ 221.52 పాయింట్ల (0.42 శాతం) లాభంతో 52,773.05 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 57.40 పాయింట్ల (0.36 శాతం) లాభంతో 15,869.25 వద్ద ముగిసింది.  దీంతో మరోసారి సెన్సెక్స్ వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో ముగిసింది. గత వారం 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 374.71 పాయింట్లు అంటే 0.71 శాతం పెరిగింది. 

 గత ట్రేడింగ్ రోజున  సోమవారం షేర్ మార్కెట్ రికార్డు సృష్టించింది.  సోమవరం 76.77 పాయింట్ల (0.15 శాతం) లాభంతో సెన్సెక్స్ 52,551.53 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 12.50 పాయింట్లు (0.08 శాతం) లాభంతో 15,811.85 వద్ద ముగిసింది. శుక్రవారం కూడా సెన్సెక్స్ 52474.76 స్థాయిలో 174.29 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 61.60 పాయింట్లు పెరిగి 15799.35 స్థాయిలో ముగిసింది.

ప్రపంచ మార్కెట్లలో అస్థిరత
సోమవారం యు.ఎస్ మార్కెట్లు అస్థిరతతో ముగిశాయి. డౌ జోన్స్ 0.25 శాతం క్షీణించి 85.85 పాయింట్లతో 34,393.80 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.74 0.25 పెరిగి 104.72 పాయింట్లతో  14,174.10 వద్ద ముగిసింది. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఇండెక్స్ నేడు 1 శాతం పెరిగింది. కొరియాకు చెందిన కోస్పి 0.15 శాతం లాభపడింది. మరోవైపు చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హెంగ్ సెంగ్ 0.90 శాతం నష్టపోయాయి. 

also read మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ యాప్‌ క్రాష్.. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాలని కస్టమర్లకు రిక్వెస్ట్.....

హెవీవెయిట్ స్టాక్స్‌ 
హెవీవెయిట్స్‌లో ఎక్కువ భాగం, ఈ రోజు ఆసియా పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌యుఎల్ స్టాక్ లాభాలతో ముగిసింది. మరోవైపు డివిస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలతో  ముగిశాయి. 

సెక్టోరియల్ ఇండెక్స్  పరిశీలిస్తే నేడు పిఎస్‌యు బ్యాంక్, ఫార్మా, మెటల్ మినహా అన్ని రంగాలు లాభాల మీద ముగిశాయి. వీటిలో ఐటి, ఎఫ్‌ఎంసిజి, ఆటో, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, మీడియా  కూడా ఉన్నాయి. 

ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల దిశ  టీకాల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. షేర్ మార్కెట్లో పాల్గొనేవారు యు.ఎస్ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్  ద్రవ్య విధాన సమీక్ష కోసం కూడా ఎదురు చూస్తారు. యు.ఎస్ సెంట్రల్ బ్యాంక్  ఉద్దీపన చర్యలను కొనసాగించాలనిస్టాక్  మార్కెట్ ఆశిస్తోంది. అలాగే బ్రెంట్ ముడి చమురు ధరలు, రూపాయి అస్థిరత, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వైఖరి కూడా మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని విశ్లేషకులు తెలిపారు. 

ఉదయం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఓపెన్ అయ్యింది. 196.08 పాయింట్ల (0.37 శాతం) లాభంతో సెన్సెక్స్ 52747.61 వద్ద ప్రారంభం కాగా, మరోవైపు నిఫ్టీ 58.00 పాయింట్ల (0.75 శాతం) లాభంతో 15869.90 వద్ద ప్రారంభమైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios