Asianet News TeluguAsianet News Telugu

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. 300 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 16450 వద్ద నిఫ్టీ..

నేడు సెన్సెక్స్ 300.17 పాయింట్లు (0.54 శాతం) తగ్గి 55,329.32 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 118.35 పాయింట్లు (0.71 శాతం) తగ్గి 16,450.50 వద్ద ముగిసింది.గత వారం సెన్సెక్స్ 1,159.57 పాయింట్లు (2.13 శాతం) లాభపడింది. ముహర్రం సందర్భంగా నిన్న స్టాక్ మార్కెట్ మూసివేసీన సంగతి తెలిసిందే.  

todays Stock Market: Market fall, Sensex slips 300 points, Nifty closed at 16450
Author
Hyderabad, First Published Aug 20, 2021, 6:04 PM IST

నేడు వారంలోని చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్ రోజంతా అస్థిరత తర్వాత  భారీగా పతనమై నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 300.17 పాయింట్లు (0.54 శాతం) తగ్గి 55,329.32 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 118.35 పాయింట్లు (0.71 శాతం) తగ్గి 16,450.50 వద్ద ముగిసింది.

గత వారం సెన్సెక్స్ 1,159.57 పాయింట్లు (2.13 శాతం) లాభపడింది. ముహర్రం సందర్భంగా నిన్న స్టాక్ మార్కెట్ మూసివేసీన సంగతి తెలిసిందే.  బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే ఇండియా స్టాక్  షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, యుపిఎల్ రెడ్ మార్క్‌తో  ముగిశాయి.  

 సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు ఎఫ్‌ఎంసిజి మినహా అన్ని రంగాలు నష్టాలలో ముగిశాయి. వీటిలో పి‌ఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, ఐ‌టి, ఫైనాన్స్ సేవలు, ఆటో, మెటల్, రియల్టీ, బ్యాంకులు, మీడియా అండ్ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. 

also read బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. 9 వేలు దిగోచ్చిన పసిడి ధర.. నేడు 10గ్రా ధర ఎంతంటే ?

టాప్ 10 విలువైన కంపెనీల్లో ఎనిమిది మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ .1,60,408.24 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి‌సి‌ఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టపోయాయి.

ప్రస్తుతం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత వరుసగా టి‌సి‌ఎస్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.

నేడు ఉదయం స్టాక్ మార్కెట్  రెడ్ మార్క్‌లో ఓపెన్ అయ్యింది.  సెన్సెక్స్ 581.19 పాయింట్లు (1.04 శాతం) తగ్గి 55048.30 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 174.30 పాయింట్ల (1.05 శాతం) పతనంతో 16394.50 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్-నిఫ్టీ కూడా గత బుధవారం రెడ్ మార్క్ తో ముగిసింది. స్టాక్ మార్కెట్ బుధవారం అత్యధిక స్థాయిలో ప్రారంభమై కాస్త హెచ్చు తగ్గులు తర్వాత  నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 162.78 పాయింట్లు (0.29 శాతం) తగ్గి 55,629.49 వద్ద ముగియగా మరోవైపు, నిఫ్టీ 45.75 పాయింట్లు (0.28 శాతం) తగ్గి 16,568.85 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 56,118.57 పాయింట్లను  నిఫ్టీ 16,701.85 పాయింట్లను తాకి రికార్డును నమోదు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios