ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధర పెరగడంతో నేడు భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఎంసిఎక్స్‌  గోల్డ్ ఫ్యూచర్స్ లో బంగారం ధర 10 గ్రాములకు 0.16 శాతం పెరిగి రూ.52,252 కు చేరుకోగా, వెండి 0.8 శాతం పెరిగి కిలోకు రూ .65,880 కు చేరుకుంది. 

గత ఐదు రోజుల్లో బంగారం ధర సుమారు 1,500 రూపాయలు పెరిగింది. వారం రోజుల్లో వెండి కిలోకు 4000 రూపాయలు భారమైంది. ఆగస్టు నెలలో బంగారం ధర 10 గ్రాములకు 56,200 రూపాయల రికార్డు స్థాయికి చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన డాలర్ కారణంగా నేడు బంగారం ధర పెరిగింది. స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సు 1,955.76 డాలర్లకు చేరుకుంది. వెండి 0.5 శాతం పెరిగి ఔన్సు 25.72 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 896 డాలర్లకు చేరుకుంది.

డాలర్ సూచీ రెండు నెలల కనిష్ట స్థాయి 92.177 వద్ద ఉంది. బలహీనమైన యుఎస్ డాలర్ ఇతర కరెన్సీలకు బంగారాన్ని చాలా చౌకగా చేస్తుంది. భారతదేశం బంగారాన్ని ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది.

also read  ఆన్‌లైన్ ట్రేయిన్ టికెట్ బుకింగులలో మార్పులు.. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం లభిచనుంది.. ...

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు-మద్దతు గల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ అయిన ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్ శుక్రవారం 0.63 శాతం పెరిగి 1,260.30 టన్నులకు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు బంగారంపై కూడా ప్రభావితమైంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు 50 మిలియన్లను దాటాయి.

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్‌ సారథ్యంలో భారీ ఉద్దీపన ప్యాకేజ్‌ ప్రకటించవచ్చనే సంకేతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ నెలకొందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ కమాడిటీస్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూజ్‌ గుప్తా పేర్కొన్నారు.

ధంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం కొనడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది బంగారం ధరలు 31 శాతం పెరిగాయి. ఆగస్టులో బంగారం భారతదేశంలో రికార్డు స్థాయిలో 56,200 కు చేరుకోగా, వెండి కిలోకు 80,000 రూపాయలకు చేరుకుంది.

పండుగ కాలంలో భారతదేశంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు.   ప్రపంచ బంగారు మండలి నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 653 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని తెలిపింది. అత్యధిక బంగారు నిల్వలో భారతదేశం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇది మొత్తం విదేశీ మారక నిల్వలలో 7.4 శాతం.

 భారతదేశంలో బంగారు దిగుమతులు ఆగస్టులో 3.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 1.36 బిలియన్ డాలర్లు. చైనా తరువాత భారతదేశం రెండవ స్థానంలో బంగారం కొనుగోలు చేసింది. భారతదేశంలో బంగారంపై  12.5 శాతం దిగుమతి సుంకాన్ని, మూడు శాతం జీఎస్టీని ఉంది.