ప్రతి రోజు పెరుగుతున్న చమురు ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తునాయి. నేడు లీటరు డీజిల్ ధర 35 నుంచి 38 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర 29 నుంచి 30 పైసలకు పెరిగింది. 

ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా ఎనిమిదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సవరించాయి. ప్రతి రోజు పెరుగుతున్న చమురు ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తునాయి. నేడు లీటరు డీజిల్ ధర 35 నుంచి 38 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర 29 నుంచి 30 పైసలకు పెరిగింది.

ఢీల్లీ, ముంబైలో పెట్రోల్ ధరలు నేటి పెంపుతో ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని ఈ రెండు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర అత్యధిక స్థాయికి చేరుకుంది. దీంతో ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .89.29 కు చేరుకోగా, ముంబైలో లీటరుకు రూ.95.75 కు చేరుకుంది.

అలాగే డీజిల్‌ ధర ఢీల్లీలో రూ .79.70 ఉండగా, ముంబైలో రూ .86.72గా ఉంది. గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ .2.44 పెరిగగా, డీజిల్ ధర లీటరుకు రూ .2.57 పెరిగింది. ఇంధన ధరల వరుస పెంపుతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 

also read బిట్‌కాయిన్ అంటే ఏమిటి.. ? ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత వరకు సురక్షితమో తెలుసుకోండి.. ...

ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి..

నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 79.70 89.29
కోల్‌కతా 83.29 90.54
ముంబై 86.72 95.75
చెన్నై 84.77 91.45
హైదరాబాద్‌ 86.93 92.84