న్యూ ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,700 ఉండగా, చెన్నైలో రూ .46,920 ఉంది. శనివారం బంగారం ధర 10 గ్రాములకు 49,100 రూపాయల నుండి 48,900 రూపాయలకు పడిపోగా, వెండి కిలోకు 51,900 రూపాయల నుండి 51,950 రూపాయలకు చేరుకుందని ప్రముఖ వెబ్‌సైట్ తెలిపింది.

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు చేయడం వల్ల బంగారం రెండవ అతిపెద్ద వినియోగదారు అయిన భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు రోజు మారుతూ ఉంటాయి. న్యూ ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 47,700 ఉండగా, చెన్నైలో రూ .46,920 ఉంది.

also read ఇళ్లు కొనేవారు కరువు ? 9 నగరాల్లో 67 శాతం తగ్గుదల.. ...

ముంబైలో  రూ.48,000, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 51,200 రూపాయలు. ఎంసిఎక్స్‌లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు 0.03 శాతం పడిపోయి 48,863 రూపాయలకు చేరుకుంది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కిలోకు 51,362 రూపాయలకు చేరింది.

ఫ్యూచర్స్ ట్రేడ్‌లో శుక్రవారం బంగారం ధరలు రూ .47 పెరిగి రూ .48,925 కు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు న్యూయార్క్‌లో ఔన్సుకు 0.27 శాతం పెరిగి 1,808.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌ మారకంలో రూపాయి అస్థిరత తదితర అంశాలు బంగారం అమ్మకాలపై ఒత్తిడిని పెంచాయి. ఇదే వారంలో గురువారం ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.49,348 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం మీద బంగారం రూ.1302లు లాభపడింది.