ప్రపంచ రేట్ల మధ్య బంగారం ధరలు వరుసగా రెండవ రోజు లాభాల కోసం కష్టపడ్డాయి. ఎం‌సి‌ఎక్స్ లో, ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర  0.06% పెరిగి రూ.48,275 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ ధర 0.3% పెరిగి 10 గ్రాములకు రూ.49,133కు చేరుకుంది.

మునుపటి సెషన్‌లో బంగారం బంగారం ధర 10 గ్రాములకు 0.1%, వెండి కిలోకు 0.5% పడిపోయింది. బంగారం, వెండి ధరలు మంగళవారం రోజున స్వల్పంగా పెరిగాయి. గత వారం బంగారం 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.48,589 చేరింది. గత వారం బలమైన లాభాలను నమోదు చేసిన రూపాయి యుఎస్ డాలర్‌కు 75.50 కి చేరుకుంది.

దేశీయ బంగారం ధరలలో 12.5% ​​దిగుమతి సుంకం, 3% జీఎస్టీ ఉంటుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం 40 రూపాయలు పెరిగి రూ. 47,250కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 పెరిగి రూ.48,450గా ఉంది.

also read బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... కరోనా ‘ఎఫెక్ట్’ మామూలుగా లేదు.. ...

హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.40 పెరిగి రూ. 46,450కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.40 పెరిగి రూ.50 వేల మార్కును దాటి రూ.50,660 వద్ద నిలిచింది.  బంగారం డీమాండ్‌, స్థానిక పరిస్థితులను బట్టి ధరలు మారే అవకాశం ఉంది.

రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కాలంలో బంగారాన్ని ఎక్కువగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇతర విలువైన లోహాలలో ప్లాటినం నేడు 0.1% పెరిగి 806.22 డాలర్లకు, వెండి 0.3% కోల్పోయి 17.81 డాలర్లకు చేరుకుంది. జూన్ లో పెండింగ్‌లో ఉన్న గృహ అమ్మకాలలో 44 శాతం రికార్డు స్థాయిలో పెరగడం, అలాగే డల్లాస్ ఫెడరల్ రిజర్వ్ నివేదించిన విధంగా ఉత్పాదక కార్యకలాపాల్లో భారీ మెరుగుదల ఉనట్లు తెలిపింది.