భారతదేశంలో ఇంధన ధరలు వరుసగా రెండవ రోజు కూడా స్థిరంగా ఉన్నాయి. జూన్ 28న రోజు నుండి ఇంధన ధరల సవరణ ఆగిపోయింది. జూన్ 30 మంగళవారం రోజున ఇంధన రేట్ల సవరణ లేకపోవడంతో దీంతో ఇంధన ధరలు మంగళవారం ధరలతో కొనసాగుతోంది.

ఢీల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు. 80.43 ఉండగా, డీజిల్ ధర లీటరుకు  రూ.80.53 గా ఉంది. లాక్ డౌన్ సడలింపుతో జూన్ 7, 2020 నుండి వరుసగా 21 రోజులు పాటు ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

గత రెండు రోజుల నుండి ఇంధన ధరల సవరణ లేకపోవడంతో వినియోగదారులకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి  లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ చమురు కంపెనీలు దాదాపు 3 నెలల విరామం తర్వాత ఇంధన రేట్ల సవరణానను తిరిగి ప్రారంభించాయి.

also read ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి‌.. రికవరీ కావాలంటే కొన్నేళ్లు.. ...

దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు ముడి చమురు, విదీశీ రేట్ల ద్వారా నిర్ణయించబడతాయి. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కారణంగా ఒక్కో రాష్ట్రానికి ధరలు మారుతు ఉంటాయి.

ఇతర మెట్రో నగరాల విషయానికొస్తే ముంబైలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు రూ.87.19 గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.78.83 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.83.63, డీజిల్ ధర లీటరుకు రూ. 77.72 గా ఉంది, కోల్‌కతాలో పెట్రోల్ రూ.82.10, డీజిల్ ధర రూ. 75.64 గా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇంధన ధరలు పెట్రోల్‌ లీటరుకు రూ.83.49, డీజిల్‌ ధర రూ.78.69 గా ఉంది, బెంగళూరులో పెట్రోల్ రూ.83.04, డీజిల్ ధర రూ.76.58 గా ఉన్నాయి.