ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు మార్కెటింగ్ సంస్థలు సెప్టెంబర్ 17 గురువారం రోజున మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గించారు.  అంతకుముందు పెట్రోల్ ధరలు  వాహనదారులను హడలెత్తించాయి. గత 3 రోజులుగా ఇంధన ధరలు దిగోస్తుండటంతో వారికి కాస్త ఊరట లభించింది. 

దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు  రూ.81.55 నుండి రూ.81.40 రూపాయలకు తగ్గి, డీజిల్ ధర లీటరుకు 72.56 రూపాయల నుండి రూ.72.37 తగ్గింది. 

also read భారత విమాన సంస్థల ఆదాయం 85% పైగా పడిపోయింది: హర్దీప్ సింగ్ పూరి ...

ముంబైలో పెట్రోల్ ధరను లీటరుకు రూ.88.21 నుండి రూ.88.07కు, డీజిల్ ధరను లీటరుకు రూ.79.05 నుండి  రూ.77.73 తగ్గించారు. హైదరాబాద్‌లో  పెట్రోల్ ధర రూ.84.60,  డీజిల్ ధర 78.88 రూపాయలు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. ఉదయం 6 గంటల నుండి  ఇంధన ధరలలో ఏదైనా సవరణలను ఉంటే అమలు చేస్తాయి.

 దేశంలో ఈ మూడు ఇంధన సంస్థలకు అత్యధిక పెట్రోల్ పంప్ స్టేషన్స్ ఉన్నాయి. యు.ఎస్. ముడి, గ్యాసోలిన్ క్షీణత తరువాత చమురు ధరలు బుధవారం 4 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.69 డాలర్లు లేదా 4.2 శాతం పెరిగిం బ్యారెల్కు 42.22 డాలర్లకు చేరింది, యు.ఎస్. ముడి బ్యారెల్కు 40.16 డాలర్ల వద్ద ఉంది.