దేశంలోని అన్నీ మెట్రో నగరాల్లో వరుసగా ఐదవ రోజు కూడా డీజిల్ ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సోమవారం డీజిల్ రేట్లను సవరించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ప్రకారం ఢీల్లీలో డీజిల్ ధర 15 పైసలు తగ్గి లీటరుకు రూ.71.58 నుండి రూ.71.43 కు చేరింది.

కానీ పెట్రోల్ ధర లీటరుకు  రూ.81.14 వద్ద ఉంది. ఇంధన ధరలు 26 పైసలు తగ్గడంతో మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత వారం సవరించారు. ముంబైలో డీజిల్ ధర 15 పైసలు తగ్గి  లీటరుకు రూ.78.02 నుండి రూ.77.87 కు వచ్చింది.

also read ప్రైవేట్ ట్రేయిన్ ఛార్జీల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు: రైల్వే బోర్డు చైర్మన్ ...

పెట్రోల్ ధర లీటరుకు రూ.87.82 వద్ద ఉంది. కోల్‌కతాలో  డీజిల్‌ ధర లీటరుకు రూ.74.94, పెట్రోల్‌ ధర రూ.82.67 ఉంది. చెన్నైలోని పెట్రోల్ 84.21, డీజిల్ ధర లీటరుకు రూ.76.85 ఉంది.

దేశ రాజధానిలో డీజిల్ ధరలను ఈ నెలలో 12 సార్లు తగ్గించగా, పెట్రోల్ ధరలను ఆరు సార్లు తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మెట్రో నగరాలలో వరుసగా 26 పైసలు, 37 పైసలు తగ్గించారు.

స్థానిక పన్నులు, వ్యాట్ విధించిన కారణంగా ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధనాల ధరలను ప్రతి రోజు సమీక్షిస్తాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశంలో ఉన్న ప్రధాన చమురు రిటైలింగ్ సంస్థలు.