పెట్రోల్, డీజిల్ ధరలు నేడు దేశీయంగా స్థ్హిరంగా ఉన్నాయి. ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు. 80.43 ఉండగా, డీజిల్ ధర లీటరుకు. 73.56 వద్ద ఉంది, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు. 87.19 వద్ద, డీజిల్ ధర లీటరుకు 80.11 గా ఉందని భారతీయు ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఉన్నాయి.

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి. దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ సంస్థలు రోజువారీగా ఇంధన ధరల సవరణలను చేస్తుంటాయి.

ధరల సవరణలు ఉంటే ఉదయం 6 నుండి పెట్రోల్ బంకుల్లో అమలు చేయబడతాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఒక నెలకు పైగా స్థిరంగా ఉండగా, డీజిల్ రేట్లు మాత్రం అనేక సందర్భాల్లో సవరించబడ్డాయి.

ఢిల్లీలో లీటర్  పెట్రోల్ ధర రూ.80,43, డీజిల్ ధర  రూ.73,56
కోలకతాలో లీటర్  పెట్రోల్ ధర  రూ.82,05 డీజిల్ రూ.ధర 77,06

also read బిలియ‌నీర్‌గా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ రికార్డు.. ...


ముంబైలో లీటర్  పెట్రోల్ ధర రూ.87,19 డీజిల్ ధర రూ.80,11
చెన్నైలో లీటర్  పెట్రోల్ ధర రూ.83,63 డీజిల్ ధర రూ.78,86
హైదరాబాద్ లో లీటర్  పెట్రోల్ ధర రూ.83.66 డీజిల్ ధర రూ.80.17

 ముడి చమురు మంగళవారం మరింత పుంజుకుంది. యుఎస్ ఉద్దీపన అంచనాలు, ఆర్థిక వ్యవస్థలు, ఆసియా డిమాండ్ పుంజుకోవడంతో ధరలు బలపడ్డాయి. నేడు బ్రెంట్ ముడి చమురు 7 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి బ్యారెల్కు 45.06 డాలర్లకు చేర్చింది.

వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ యు.ఎస్. ముడి చమురు 14 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్కు 42.08 డాలర్లకు చేరుకుంది.