గతకొంత కాలం ఇంధన ధరలు వాహనదారులను  బెంబేలెత్తిస్తున్నాయి. బడ్జెట్ 2021-22 తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజా పెంపుతో ఆల్ టైం గరిష్ట స్థాయికి ఇంధన  ధరలు చేరుకున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు రాష్ట్ర చమురు కంపెనీలు పెంచాయి. నేడు డీజిల్  లీటర్ ధరపై  30 నుంచి 32 పైసలకు పెరగగా, పెట్రోల్ ధరపై 29 నుంచి 30 పైసలకు పెరిగింది.

దీంతో దేశ రాజధాని  ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్‌ ధర రికార్డు  స్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారకపు రేటుతో  మారుతూ ఉంటాయి.

ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉంది.

also read అమెజాన్ కొత్త సీఈఓ ఆండీ జెస్సి ఎవరు ? అతని గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యప...
  
నగరం         డీజిల్    పెట్రోల్
ఢీల్లీ              77.13    86.95
కోల్‌కతా        80.71    88.30
ముంబై         83.99     93.49
చెన్నై            82.33    89.39
హైదరాబాద్‌    84.14   90.42

ప్రతిరోజూ  ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు సవరించబడతాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర  జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

 ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరను నిర్ణయిస్తాయి. డీలర్లు పెట్రోల్ పంపులను నడుపుతున్న వ్యక్తులు పన్నులు, వారి స్వంత మార్జిన్లను జోడించిన తరువాత వారు రిటైల్ ధరలకు వినియోగదారులకు  ఇంధనం అమ్ముతారు.