న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను శనివారం మెట్రో నగరాలలో పెంచారు. దాదాపు 12 వారాల లాక్ డౌన్ విరామం తరువాత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు రోజు సమీక్షల భాగంగా లీటర్‌ పెట్రోల్‌ ధర 59 పైసలు, డీజిల్‌ ధర 58 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో దేశంలో ప్రముఖ నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌పై 59 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి పెంచిన ఇంధన ధరలు అమల్లోకి వస్తాయని  తెలిపింది. అంతకుముందు రోజు పెట్రోల్ ధర లీటరుకు 74.57 రూపాయల నుండి 75.16 రూపాయలకు సవరించగా, డీజిల్ రేటు లీటరుకు రూ .72.81 నుండి రూ .73.39 కు పెంచింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌తో 82 రోజులపాటు పెట్రో ధరలను స్థిరంగా కొనసాగించిన కంపెనీలు ఈ నెల 7 నుంచి వరుసగా ప్రతిరోజు ధరలను పెంచుతూ వస్తున్నాయి.

also read ‘లాక్‌డౌన్‌’తో టెక్కీలకు కష్టాలు: హెచ్‌1బీ వీసా రద్దు..!

ఈ ఏడు రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3.9, డీజిల్‌ ధర రూ.4 పెరిగింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.10, డీజిల్‌ రూ.69.23, కోల్‌కతాలో రూ.77.05, రూ.69.23, చెన్నైలో రూ.78.99, రూ.71.64, బెంగళూరులో రూ.74.21, రూ.69.78గా ఉన్నాయి.

ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) లేదా జెట్ ఇంధనం, పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పి‌జి) తో పాటు, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. అయితే, మార్చి 16 నుండి, చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.