Asianet News TeluguAsianet News Telugu

Today Petrol Diesel Prices: గుడ్ న్యూస్‌.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగానే కొన‌సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను ఆదివారం తాజాగా విడుదల చేసింది. 

Today Petrol Diesel Prices
Author
Hyderabad, First Published Jan 23, 2022, 9:02 AM IST

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగానే కొన‌సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను ఆదివారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కనిపించాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం ఈవిధంగా ఉన్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు. క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. ఆ కోణంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రతిరోజూ పెంచవచ్చు. కానీ.. ప్రస్తుతం దేశంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతూనే మరోవైపు 80 రోజులుగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

 - ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. క్రూడ్ ధరలు ఆదివారం తగ్గాయి. కానీ క్రూడ్ ధరలు 87 డాలర్ల పైనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.72 శాతం క్షీణించింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 87.74 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. 0.83 శాతం క్షీణించింది. దీంతో ఈ రేటు 84.84 డాలర్లకు తగ్గింది.

కాగా భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios