అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటోన్నాయి. కరోనా దెబ్బకు క్రూడాయిల్ ధరలు 4 శాతం వరకు పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటోన్నాయి. కరోనా దెబ్బకు క్రూడాయిల్ ధరలు 4 శాతం వరకు పెరిగాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలో ప్రధాన నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. గత 70 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చివరి సారి దీపావ‌ళి సమయంలో పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ డ్యూటీని తగ్గించిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌కు కోత పెట్టాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ధరలు రూ.10 నుంచి రూ.17 వరకు దిగొచ్చాయి. దీపావ‌ళి తర్వాత ఒక్క రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు, తగ్గలేదు.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌ రూ.108.20గా, లీటర్‌ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.95.41గా, లీటర్‌ డీజిల్ ధర రూ.86.67గా పలుకుతోంది. అలాగే ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.109.98 వద్ద, లీటర్‌ డీజిల్ ధర రూ.94.14 ప‌లుకుతోంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్ రూ.101.40గా, లీట‌ర్‌ డీజిల్ ధర రూ.91.43గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ రేటు రూ.104.67గా, లీటర్‌ డీజిల్ రేటు రూ.89.79గా పలుకుతున్నాయి.