Asianet News TeluguAsianet News Telugu

శుభవార్త... భారీగా పడిపోయిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.230 తగ్గుదలతో రూ.39,130కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 
 

Today Gold Rate in Hyderabad - 20 Aug 2019
Author
Hyderabad, First Published Aug 20, 2019, 3:21 PM IST

బంగారం కొనుగోలు దారులకు ఇది నిజంగా శుభవార్త. నిన్నటి వరకు ఆకాశాన్నంటిన బంగారం ధర ఈ రోజు కాస్త దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.230 తగ్గుదలతో రూ.39,130కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గుదలతో రూ.35,870కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం
 

Follow Us:
Download App:
  • android
  • ios