Asianet News TeluguAsianet News Telugu

Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. బంగారం ధ‌ర‌కు బ్రేక్‌..!

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదలకు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియంట్, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. 

Today Gold Price
Author
Hyderabad, First Published Jan 18, 2022, 10:09 AM IST

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదలకు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియంట్, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఇవాళ దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..!

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate) 10 గ్రాముల ధర 47 వేల 140 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 430 రూపాయలు 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 90 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలు

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 340 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 440 రూపాయలు

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 300 కాగా,  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 50 వేల రూపాయ‌లు

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలు

కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుగా ఉంది. 

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate) 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. ఇక విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. 

షాకిస్తున్న వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,000 లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,000 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,500లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 62,000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. కేరళలో కిలో వెండి ధర 65,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios