Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌కు బెనిఫిట్: ఎం క్యాప్‌లో టీసీఎస్‌ ఫట్

రూపాయి పతనం.. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంతో భవిష్యత్ లో ప్రతికూల ప్రభావం పడుతుందన్న ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరికల మధ్య ఈ వారం స్టాక్ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. 

Three of top 10 companies lose Rs 1 lakh crore in m-cap; TCS hit hard
Author
Mumbai, First Published Oct 15, 2018, 9:02 AM IST

రూపాయి పతనం.. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంతో భవిష్యత్ లో ప్రతికూల ప్రభావం పడుతుందన్న ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరికల మధ్య ఈ వారం స్టాక్ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ ఇండెక్స్‌లో సెన్సెక్స్‌లోని టాప్ 10 బ్లూ చిప్ స్టాక్స్‌లో మూడు షేర్లు భారీగా నష్టపోయాయి. అందునా ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్ భారీగా పతనమైంది. 

అగ్రశ్రేణి మూడు కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ రూ.1,07,026.12 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. తర్వాతీ జాబితాలో ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీగా పతనమైన సంస్థలుగా నిలిచాయి. మరోవైపు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా షేర్లు లబ్ధితో ముగిశాయి. 

భారీగా నష్టపోయిన మూడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే మిగతా లబ్ధి పొందిన ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా నమోదైంది. లాభం పొందిన ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.97,498.38 కోట్లకు చేరుకున్నది. దీనికి భిన్నంగా టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,330.17 కోట్లు తగ్గి రూ. 7,19,857.48 కోట్ల వద్ద స్థిర పడింది. శుక్రవారం టీసీఎస్ షేర్ మూడు శాతానికి పైగా నష్టపోయింది. 

ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,696.68 కోట్లు పతనమై రూ.2,96,635.05 కోట్ల వద్ద స్థిరపడింది. ఇక ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2,999.27 కోట్ల నష్టపోయి రూ.3,36,285.40 కోట్లకు చేరుకున్నది. 

లబ్ధి పొందిన వాటిలో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.48,524.59 కోట్లు పెరిగి రూ. 7,13,965.75 కోట్లకు చేరింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,130.78 కోట్లు పెరిగి రూ.2,23,005.06 కోట్లకు చేరుకోగా, మారుతి సుజుకి ఎం క్యాప్ రూ.11,782.63 కోట్లు లబ్ధి పొంది రూ.2,20,006.42 కోట్ల వద్ద స్థిరపడింది. 

దేశీయ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ మేజర్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,953.14 కోట్లు పెరిగి రూ.2,35,029.01 కోట్ల వద్ద స్థిర పడగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,388.24 కోట్లు పెంచుకుని రూ.5,37,729.17 కోట్ల వద్దకు చేరింది.

మరో ఆర్థిక సంస్థ హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,727.52 కోట్లు పెరిగి రూ.2,94,247.71 కోట్లకు చేరగా, హిందూస్థాన్ యూనీ లీవర్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.1,991,48 కోట్లు పెంచుకుని రూ.3,39,557.66 కోట్ల వద్ద స్థిరపడింది. 

పలు ఒడిదొడుకుల మధ్య సెన్సెక్స్ కేవలం 366.59 పాయింట్లు లాభ పడి 34,733.58 పాయింట్ల వద్ద స్థిర పడింది. టాప్ 10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది. తర్వాత స్థానంలో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి నిలిచాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios