కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ చిత్ర నిర్మాత తన ప్రియురాలికి ప్రోపోజ్ చేయడానికి తనకి ఇష్టమైన డిస్నీ మూవీని రి-యానిమేట్ చేశాడు ప్రస్తుతం ఇంటర్నెట్లో అది వైరల్ అవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ఆ  మ్యారేజ్ ప్రోపోజల్ తనని చాలా ఆకట్టుకున్నదని ఎంతగా అంటే అది తనకు ఇన్ఫెరియొరిటీ కాంప్లెక్స్ ఇచ్చిందని చెప్పారు.

also read మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు...

ఆనంద్ మహీంద్రా లీ లోచ్లర్  ప్రోపోజల్ మెచ్చుకుంటూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. తాను ఎడిట్ చేసిన స్లీపింగ్ బ్యూటీ సన్నివేశ  క్లిప్‌ను పంచుకున్నారు.ఆ క్లిప్ ప్రిన్స్ ఫిలిప్, అరోరా పాత్రలను లీ లోచ్లర్, అతని స్నేహితురాలు స్తుతి డేవిడ్‌ను పోలి ఉండేలా యానిమేట్ చేశారు.


"ఈ క్లిప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది" అని ఆనంద్ మహీంద్రా (64) తన ట్వీట్ లో తెలిపారు."ఈ చిన్న వ్యక్తి తన చిన్ననాటి స్నేహితురాలు స్వీట్‌హార్ట్‌కు ప్రపోజ్ చేయడానికి డిస్నీ మూవీని హాక్-యానిమేట్ చేసాడు. ఇది చూశాక 40 సంవత్సరాల క్రితం నేను నా భార్యకి ప్రోపోజ్ చేసి మంచి పని చేశానని అనుకున్నాను.

also read అమెజాన్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ఫైర్...కారణం ?


ఆనంద్ మహీంద్రా వెర్వ్ మ్యాగజైన్ వ్యవస్థాపకురాలు అనురాధ మహీంద్రాని వివాహం చేసుకున్నారు. అంతకుముందు ట్వీట్‌లో, ఇండోర్‌లో తన భార్యను "కలుసుకుని ప్రేమలో పడ్డానని" వెల్లడించాడు. ఇద్దరూ కలిసి బోస్టన్‌లో కలిసి చదువుకున్నారు.

ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ కి 13వేల 'లైక్స్' అలాగే చాలా మంది కామెంట్స్ చేశారు. 40 సంవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్ర తన భార్యకు ఎలా ప్రోపోజ్ చేశారు అని  చాలా మంది  ట్వీట్ల ద్వారా అడిగారు.లీ లోచ్లెర్ డిస్నీ నేపథ్య ప్రోపోజల్ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యింది. ఇది యూట్యూబ్‌లో 5 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి.