ఈ స్టాక్ ఏకంగా రూ. 495 నుంచి రూ. 5కు పడిపోయింది...లక్షాధికారులను భిక్షాధికారులను చేసిన స్టాక్ ఇదే..
ఒక్కోసారి కొన్ని షేర్లు మనకి లాటరీ టికెట్లు తగిలినట్లు తగులుతూ ఉంటాయి. అందులో పెట్టిన డబ్బు మనల్ని కోటీశ్వరులను కూడా చేస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం కొన్న షేర్లు రివర్స్ గేర్ లో వెళ్తూ ఉంటాయి. అవి ఎంత రివర్స్ లో వెళ్తాయంటే మనం లక్షాధికారి నుంచి భిక్షాధికారిని చేసే వరకు విడిచిపెట్టవు.
కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ మార్కెట్లో మనల్ని దరిద్రులుగా మారుస్తూ ఉంటాయి. అలాంటి ఓ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ స్టాక్ ఇన్వెస్టర్లను ఒక్క దెబ్బతో నష్టాలను మూటగట్టింది చాలా తక్కువ సమయంలోనే ఈ స్టాక్ రూ. 490 నుండి రూ. 5కి దిగివచ్చింది. ఇలా ఇన్వెస్టర్ల సొమ్మును గాల్లో కలిపేసింది.
స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ ఉన్నాయి, వీటిలో పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టేవారి మూలధనం మునిగిపోయింది. పెట్టుబడిదారుల సొమ్మును ముంచేసే చేసే స్టాక్‌లలో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ లిమిటెడ్ కూడా ఒకటి. ఈ స్టాక్ నిరంతర క్షీణతను చూస్తోంది.
ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో బంపర్ లాభాలను పొందుతారు. కొన్నిసార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. చాలా కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను లక్షాధికారులను, కోటీశ్వరులను చేశాయి. అదే సమయంలో కొన్ని స్టాక్స్ నష్టాల్లో కూరుకుపోయి ఇన్వెస్టర్లను మూంచేశాయి. అటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. దీని షేర్లలో పెట్టుబడిదారుల మూలధనం మునిగిపోయింది. అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి మీ ఆర్థిక సలహాదారుతో మాట్లాడండి. ఇలా చేయకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ (FLFL) ఇన్వెస్టర్లను ముంచేసిన స్టాక్స్ లో ఒకటి.
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను కొనసాగిస్తోంది. దీని షేర్లు నిరంతర క్షీణతను చూస్తున్నాయి. ఈరోజు షేర్ ధర రూ.4.70. గత ఏడాది కాలంలో ఇది 75 శాతం పడిపోయింది. అదే సమయంలో, గత 5 సంవత్సరాలలో, ఈ షేర్ విలువ భారీగా పడిపోయింది. చాలా మంది ఇన్వెస్టర్ల మూలధనం ఈ స్టాక్‌లో చిక్కుకుంది.
స్థిరమైన క్షీణత
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు స్థిరంగా క్షీణిస్తున్నాయి. ఏప్రిల్ 2019లో కంపెనీ స్టాక్ రూ.490 వద్ద ట్రేడవుతోంది. అప్పటి నుంచి తగ్గుదల కనిపిస్తోంది. ఇప్పుడు రూ.5 లోపే దిగివచ్చింది. కంపెనీకి భారీ అప్పులు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముంబై బెంచ్ మే 4న ఫ్యూచర్ లైఫ్‌స్టైల్‌కు వ్యతిరేకంగా కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌తో పాటు, పెట్టుబడిదారులు తమ డబ్బును కోల్పోయిన అనేక ఇతర స్టాక్‌లు ఉన్నాయి. ఈ స్టాక్‌లలో జైప్రకాష్ అసోసియేట్స్, ఫ్యూచర్ రిటైల్, యెస్ బ్యాంక్, యూనిటెక్, వొడాఫోన్-ఐడియా ఉన్నాయి. వీటిపై పెట్టుబడి పెట్టిన వారు భారీగా నష్టపోయారు. ఇప్పటికీ ఈ కంపెనీల షేర్లు క్షీణిస్తూనే ఉన్నాయి.