జాకీ, స్పీడో వంటి అండర్‌గార్మెంట్ బ్రాండ్‌లు కలిగి ఉన్న పేజ్ ఇండస్ట్రీస్ షేరు ధర ఏకంగా రూ. 50 వేలు దాటిపోయింది. అంటే ఒక్కో షేరు ధర 10 గ్రాముల బంగారంతో పోటీ పడుతోంది. కంపెనీ స్టాక్ మల్టీబ్యాగర్ స్టాక్. గత పదిహేనేళ్లలో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 18110 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.

ఆగస్ట్ 12, శుక్రవారం నాడు పేజ్ ఇండస్ట్రీస్ షేర్ (Page Industries Limited) ధర భారీగా పెరిగింది. ఈరోజు ఇంట్రాడేలో, ఈ స్టాక్ రూ. 50 వేల స్థాయిని దాటింది. కొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. BSEలో కూడా Page Industries Limitedషేరు రూ. 50,338 స్థాయికి చేరుకుంది. జూన్ త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాల కారణంగా కంపెనీ షేర్లు బుల్లిష్ గా మారాయి. గత 15 సంవత్సరాలలో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 18110% శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది.

పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1994లో స్థాపించారు. పేజ్ ఇండస్ట్రీస్ జాకీ, స్పీడో వంటి అండర్ గార్మెంట్స్ బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియో ద్వారా మార్కెట్లో లీడర్ గా అవతరించింది. పేజ్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.207 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.10.9 కోట్లుగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,341 కోట్లు కాగా, 2022 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపుగా ఉంది. 

లైవ్ మింట్ నివేదిక ప్రకారం, బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీ తన నివేదికలో మీడియం నుండి దీర్ఘకాల వ్యూతో చూసినట్లయితే, Page Industries Limited మార్జిన్ విస్తరణ సామర్థ్యం ఉందని గత 10 సంవత్సరాలలో, ఈ సంస్థ EBITDA మార్జిన్ 18 శాతంగా ఉందని తెలిపింది. అంతేకాదు బ్రోకరేజ్ పేజ్ ఇండస్ట్రీస్ టార్గెట్ ధరను రూ.52,000గా నిర్ణయించింది.

మరోవైపు, బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ కూడా Page Industries Limited పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఉత్పత్తుల అమ్మకాలలో పెరుగుదల ఉంది. అన్ని సరఫరా గొలుసులు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇది FY 2023లో పెరిగిన డిమాండ్ నుండి కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తుంది. ICICI సెక్యూరిటీ రూ. 51,900 టార్గెట్ ధరతో పేజ్ ఇండస్ట్రీస్‌కు హోల్డ్ రేటింగ్ ఇచ్చింది.

15 సంవత్సరాలలో 18110% రాబడి అందించింది.
గత నెలలో పేజ్ ఇండస్ట్రీస్ షేర్ 13.51 శాతం లాభపడింది. అదేవిధంగా, గత ఆరు నెలల్లో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు దాదాపు 25 శాతం లాభాలను అందించింది. అదేవిధంగా, 2022 సంవత్సరంలో, ఈ స్టాక్ 19.48 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 50 శాతం లాభపడింది. గత ఐదేళ్లలో, ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 186 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. అదేవిధంగా, గత 15 సంవత్సరాలలో, ఈ స్టాక్ 18110% రాబడిని ఇచ్చింది.