Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో అత్యంత ఖరీదైన విస్కీ ఇదే...ధర తెలిస్తే షాక్ అవుతారు..

లండన్‌లోని సోథెబీస్‌లో స్కాచ్ విస్కీ బాటిల్ 2.2 మిలియన్ పౌండ్లకు విక్రయించారు. అంటే దాదాపు రూ.22 కోట్లు పలికింది.

This is the most expensive whiskey in the world...you will be shocked if you know the price
Author
First Published Nov 20, 2023, 7:32 PM IST

లండన్‌లోని సోథెబీస్‌లో స్కాచ్ విస్కీ బాటిల్ 2.2 మిలియన్ పౌండ్లకు విక్రయించారు. అంటే దాదాపు రూ.22 కోట్లు పలికింది. ఒక వైన్ లేదా స్పిరిట్ బాటిల్ కోసం చెల్లించిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం.  మకాలన్ అదామీ బ్రాండుతో ఉత్పత్తి  చేసిన ఈ విస్కీ బాటిల్ వేలంలో రికార్డు మొత్తానికి అమ్ముడు పోయింది. "ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విస్కీ"గా పేర్కొనబడిన మకాల్లన్ అదామి విస్కీని 1986లో తయారు చేశారు. ఆ సమయంలో 40 సీసాలు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇవి ఇటాలియన్ కళాకారుడు వాలెరియో అడామి రూపొందించిన లేబుల్‌తో  ఈ సీసాలు విడుదల అయ్యాయి.  2019లో, సుమారు 1.5 మిలియన్ పౌండ్లకు అమ్ముడు పోగా. అప్పట్లో ఇదే రికార్డు ధర. కిర్‌స్టెన్ కాంప్‌బెల్ దీని గురించి చెబుతూ ఈ విస్కీలో డార్క్ చాక్లెట్, ట్రెకిల్, అల్లం,  రిచ్ బ్లాక్ చెర్రీ కంపోట్, జిగట ఖర్జూరం, పురాతన ఓక్ వాసనలు ఉన్నాయని పేర్కొన్నారు. .

 

Follow Us:
Download App:
  • android
  • ios