డబ్బులు ఊరికే రావు అంటూ ఊదరగొట్టే బంగారు నగల మంత్లీ చిట్ స్కీం వెనుక ఉన్న మోసం ఇదే..ఆశ్చర్యపోయే నిజాలు..
డబ్బులు ఊరికే రావు అంటూ ప్రతినెల మంత్లీ చిట్టీ ద్వారా నగలు కొనుగోలు చేయమని ఆభరణాల దుకాణాల వారు, హడావిడి చేస్తుంటారు అంతేకాదు 11 నెలలు చిట్టి మీరు కడితే ఒక నెల చిట్టి తామే భూరీ విరాళం గా ఇస్తున్నామంటూ చెబుతూ ఉంటారు. నిజానికి ఈ భూరి విరాళం వెనక ఉన్న మతలబు ఏంటి అసలు ఈ స్కీములు సురక్షితమైన తెలుసుకుందాం.
డబ్బులు ఊరికే రావు అంటూ ఓ నగల వ్యాపారి హడావిడి చేస్తున్న యాడ్స్ మనం టీవీల్లోనూ, న్యూస్ పేపర్లలోనూ మనం చూస్తూనే ఉంటాం. బంగారం మా షాపులో కొనుగోలు చేస్తే మరి ఎక్కడ దొరకని లాభాలు మీకు అందిస్తామంటూ, ఆ నగల వ్యాపారి మీకు హామీ ఇస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రతినెల బంగారం షాపులో మంత్లీ చిట్ స్కీం కింద, బంగారం కొనుగోలు చేయమని ప్రోత్సహించడం కూడా మనం గమనిస్తుంటాం. అంతేకాదు ఒక సంవత్సరం పాటు ఉండే ఈ చిట్ స్కీంలో, మీరు ఒక నెల డబ్బు చెల్లిస్తే ఒక నెల సంస్థ తరఫున ఆయనే చెల్లిస్తానని మనకు భూరీ విరాళం కూడా ఇస్తున్నట్లు బిల్డప్ కూడా ఇస్తూ ఉంటారు. నిజానికి 12 నెలల్లో మీరు కేవలం 11 నెలలు మంత్లీ చిట్స్ కడితే చాలు, ఒక నెల మేమే కట్టి మీకు బంగారం ఇస్తాము అని నమ్మిస్తుంటారు. కానీ ఇలా మంత్లీ స్కీం కింద బంగారం కొనుగోలు చేయడం మీకు సేఫేనా ? ఇది లాభదాయకమేనా ? అసలు దీని వెనక ఉన్న మతలబు ఏమిటో... తిరకాసు ఏమిటో... ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిజానికి మన దేశంలో బంగారం అంటే ఇష్టపడని కుటుంబం ఉండదు. ఎందుకంటే భారతీయులకు బంగారంతో ఉన్న ప్రేమ విడదీయరానిది. భూమి తర్వాత ఎక్కువగా జనాలు ఇష్టపడేది బంగారాన్ని ఇప్పటికీ మనదేశంలో స్టాక్ మార్కెట్ లోను మ్యూచువల్ ఫండ్స్ లోను, పెట్టుబడులు పెట్టే వారి కన్నా కూడా బంగారం భూమి పైనే ఎక్కువగా పెట్టుబడి పెట్టే వారిని చూస్తూ ఉంటాము. కష్టకాలంలోనూ బంగారం ఆదుకుంటుందని బంగారం లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటారు. అందుకే తాము సంపాదించుకున్న డబ్బులు కొంత భాగం బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు.
చట్టం ఏం చెబుతోంది..
మధ్య తరగతి ప్రజలకు బంగారంపై ఉన్న మోజును ఆసరాగా చేసుకొని నగల దుకాణాల వాళ్ళు మంత్లీ చిట్ స్కీం తీసుకొచ్చారు. నిజానికి ఇలాంటి పథకాలకు చట్ట పరిధిలో ఎలాంటి అనుమతి లేదు, అంతేకాదు ఇది పూర్తిగా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ ఆ వ్యాపారి డబ్బుతో ఉడాయించిన ఎవరికీ జవాబు ఉండదనే చెప్పవచ్చు. ప్రజల వద్ద నుంచి డబ్బు సేకరించిన డబ్బులు వారు అడ్వాన్స్ పేమెంట్ గా చెబుతున్నప్పటికీ, వీటికి ఎలాంటి నియంత్రణ లేదనే చెప్పవచ్చు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చట్టం 2013 ప్రకారం మాత్రమే నగల షాపుల వారు ఈ అడ్వాన్స్ పేమెంట్ లను తీసుకుంటున్నారు. అయితే ఆర్బిఐ కానీ సెబీ కానీ ఇంకా ఇలాంటి స్కీముల గురించి పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ గోల్డ్ స్కీములు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చట్టం 2016 లో మార్పుల తర్వాత కొద్దిగా నియంత్రణలోకి వచ్చాయి. అయితే కొత్తచట్టం ప్రకారం నగల షాపు వారు. డబ్బు అడ్వాన్సుగా తీసుకున్న తర్వాత వారు ఏడాదిలోగా వస్తువును డెలివరీ చేయాలి లేదంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
1 నెల చిట్టీ నగల షాపుల వారు కడతాము అని హామీ వెనుక ఉన్న మోసం ఇదే..
అయితే నగల షాపుల్లో మీరు మంత్లీ చిట్స్ స్కీం కింద డబ్బు కట్టడం ద్వారా నష్టమే అని చెప్పవచ్చు. ఇందులో ఒక నెల నగల షాపు వారి కడుతున్నామని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో ఓ మతలబు ఉంది. మీరు డబ్బు 11 నెలలు చెల్లించిన తర్వాత మీరు నగలు డెలివరీ పొందే సమయానికి, ఆరోజు బంగారం ధరకు నగలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మేకింగ్, వేస్టేజీ ఇలా అదనపు చార్జీల పేరిట నగలపై అదనపు చార్జీలను వసూలు చేస్తారు. ఈ లెక్కన చూస్తే నగల షాపు వారు ఇచ్చినటువంటి 12వ నెల చిట్టి కూడా ఈ లాభంలో కొట్టుకుపోతుంది అన్న సంగతి గమనించాల్సి ఉంటుంది.
మరి బంగారం కొనాలంటే ఏం చేయాలి.. ప్రత్యామ్నాయం ఏమిటి
ప్రస్తుతం బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లు చక్కటి వడ్డీ రిటర్న్లను ఇస్తున్నాయి ఒకవేళ మీరు నగలు కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రతినెల ఉదాహరణకు ప్రతినెల 5000 చొప్పున రికరింగ్ డిపాజిట్లు పొదుపు చేసుకున్నట్లయితే మీకు సుమారు ఏడు నుంచి తొమ్మిది శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది తద్వారా మీ డబ్బు సురక్షితంగా బ్యాంకుల్లో ఉంటుంది మెచ్యూరిటీ తర్వాత రికరింగ్ డిపాజిట్ నుంచి వచ్చిన డబ్బుతో మీరు నగలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి డబ్బులు ఊరికే రావు అనే స్కీముల్లో చేరి రిస్క్ లో పడే కన్నా కూడా బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.