ఈ క్యాబ్ డ్రైవర్ క్వాల్‌కామ్, ఐటీ కంపెనీ ఉద్యోగి కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు..!సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
రద్దీగా ఉండే రోడ్డులో క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు IT ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించడమే కాకుండా పై చదువుతో ఉన్నారు.
చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం కోసం వెతికితే అది దొరకడం కష్టం. ఒకవేళ వచ్చినా కొన్నిసార్లు అనుకున్నంత జీతం ఉండదు. పనిలో సుపీరియారిటీ ఉండదని అందరూ తెలుసుకోవాలి. ఒక అపార్ట్‌మెంట్ నిర్మాణ సమయంలో పైన క్రేన్ లో కూర్చున్న వ్యక్తిని కింద ఉన్న ఇంజనీర్ చిన్నచూపు చూస్తారు. కానీ ఆక్కడ పైన వ్యక్తి జీతం ఎక్కువే ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఏసీ రూంలో కూర్చున్న ఐటీ ఉద్యోగి రోడ్డు పై వెళ్లే క్యాబ్ డ్రైవర్ చదువుకోలేదేమో, తక్కువ జీతం తీసుకునే వ్యక్తి అన్ని అనుకుంటే అది కూడా తప్పే. చదువుకోవడం వల్ల మీ సంపాదన పెరుగుతుందా లేదా మీ జ్ఞానాన్ని పెంచుతుందా ? వీటన్నిటికంటే సంపాదనకు పని పట్ల అంకితభావం ఇంకా ప్రేమ అవసరం.
రద్దీగా ఉండే రోడ్డులో క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు IT ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించడమే కాకుండా పై చదువుతో ఉన్నారు. కరోనా తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చెప్పడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగులకు సరైన జీతాలు అందడం లేదు. కంపెనీలు కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించాయి. కాగా, ట్విట్టర్‌లో శ్వేతా కుక్రేజా అనే మహిళ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆమె క్యాబ్‌లోకి ఎక్కగానే ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని తెలిసింది. అలాగే ఆ డ్రైవర్ క్వాల్‌కామ్‌లో కార్పొరేట్ ఉద్యోగం కంటే ఎక్కువ సంపాదిస్తున్నడని తెలుసుకుంది. శ్వేత ట్విట్టర్ పోస్ట్ వైరల్‌గా మారడంతో పలువురు వావ్ అంటూ కామెంట్స్ కూడా చేశారు.
"నేను నిన్న క్యాబ్‌లో ఉన్నాను, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్. క్వాల్‌కామ్‌లో కార్పొరేట్ ఉద్యోగం కంటే క్యాబ్ డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ సంపాదిస్తున్నాడని" శ్వేత ట్వీట్ చేసింది. క్వాల్‌కామ్ దేశంలోనే అత్యుత్తమంగా జీతాలు చెల్లింపులు జరుపుతున్న కంపెనీలలో ఒకటిగా ఉన్నందున ఈ ట్వీట్ వెనుక ఉన్న నిజాన్ని చాలా మంది అనుమానించారు. మరికొందరు ఇతర కార్మికుల సంపాదన అలాగే వారి శ్రమ గురించి ఉదాహరణగా చెప్పారు.
మా ఇంటి దగ్గర పానీపూరీ వాలా నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. అతను కేవలం 6వ తరగతి పాసయ్యాడు. ఇప్పుడు వేరే లొకేషన్‌లో మరో స్టాల్ ఓపెన్ చేశాడని, ఇది సంపాదన గురించి కాదని ఒకరు ట్వీట్ చేశారు. ఆఫీసులోనో ఇంట్లోనో కూర్చొని మీటింగ్స్ హాజరు కావడం కాకుండా రోజంతా ట్రాఫిక్, పొల్యూషన్‌లో వారు గడుపుతున్నారని ఆయన అన్నారు.
క్యాబ్ నడపడం అంత తేలికైన పని కాదు. ప్రయాణికులను సకాలంలో వారి వారి ప్రాంతాలకు సురక్షితంగా చేరవేయాలి. సరైన రేటింగ్ వస్తే వారి సంపాదన పెరుగుతుంది. ఇది న్యాయమే” అని మరొకరు ట్వీట్ చేశారు.