మీరు కొత్త కారు కొనేందుకు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా ఈజీగా తక్కువ వడ్డీకి ఫైనాన్స్ పొందవచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దాం...
కొత్త కారు కొనడం ప్రతిఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకమైన సందర్భం. అయితే దానికోసం సరైన ఫైనాన్స్ పొందడం కొన్నిసార్లు ఓ పెద్ద సమస్యగా అనిపిస్తుంది. మీరు మీ కలల కారును ఎంచుకుంటున్నారా లేదా నిత్యావసరాలకు ఉపయోగించేందుకు వాహనాన్ని కొనాలని చూస్తున్నారా అన్నది పక్కన పెడితే కొత్త కారు ఫైనాన్స్ వేగంగా, సాఫీగా పొందడం అత్యవసరం.
ఒకసారి ఊహించండి... మీకు నచ్చిన కారును ఎంచుకున్నారు, కానీ ఫైనాన్స్ ఆమోదం కోసం ఎంతకాలం వేచి ఉండాలో అనే ఆందోళన మిమ్మల్ని బాధిస్తోంది. ఈ ఊహే నచ్చడంలేదు కదా... అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఫైనాన్స్ ప్రక్రియను వేగవంతం చేసుకుని, ఆమోదం పొందే అవకాశాలను మరింత పెంచుకోవచ్చు.
ఈ ఆర్టికల్‌లో కొత్త కారు ఫైనాన్స్‌ను వేగంగా ఆమోదించుకునేందుకు అవసరమైన ముఖ్యమైన చిట్కాలను మీకు తెలియజేస్తాం. వీటిని పాటించడం ద్వారా మీ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి. మరి విషయానికి వస్తే...
ఎందుకు కొత్త కారు ఫైనాన్స్‌ను వేగంగా పొందడం ముఖ్యం?
ఇలా త్వరగా ఫైనాన్స్ ఆమోదం వల్ల మీరు తక్కువ కాలంలో లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు. అంతే కాకుండా మీకు అనుకూలమైన లోన్ షరతులను సమయానికి లాక్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు పెరిగిపోవడం లేదా తక్కువ కాలపరిమితి ఉన్న ఆఫర్లు కోల్పోవడం వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వేగవంతమైన ప్రపంచంలో సమయం అంటే డబ్బు. కొత్త కారు ఫైనాన్స్ సక్రమంగా ఉంటే మీకు ఈ రెండూ ఆదా అవుతాయి.
కొత్త కారు ఫైనాన్స్‌ను త్వరగా పొందడం ఎలా?
1. అప్లై చేసేముందు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రిపోర్ట్ కార్డులా ఉంటుంది. ఇది మీరు తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఎంత ఉందో రుణదాతలకు తెలియజేస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ (సాధారణంగా 700 కు పైగా ఉంటే) రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించగలరని సూచిస్తుంది. అంటే మీకు రుణం ఇవ్వడం తక్కువ ప్రమాదకర రుణదాతకు సూచిస్తుంది. తద్వారా ఫైనాన్స్‌ను వేగంగా ఆమోదించే అవకాశాలను పెంచుతుంది. అదే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఫైనాన్స్ ఆమోదంలో ఆలస్యం అవుతుంది... మీ ఫైనాన్స్ అభ్యర్థనను తిరస్కరించబడే అవకాశమూ ఉంటుంది.
అప్లై చేయడానికి ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడం ద్వారా దాన్ని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు లేదా ఏవైనా సమస్యలు ఉంటే అవగాహన పొందవచ్చు.
మీ క్రెడిట్ రిపోర్ట్‌ను సమీక్షించండి.
మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అని చూడండి. కొన్ని సార్లు చిన్న తప్పిదాల వల్ల మీ స్కోర్ తగ్గిపోవచ్చు, అది మీకు తెలియకపోవచ్చు కూడా. అలాంటి పొరపాట్లను గుర్తించి వాటిపై వివరణ కోరడం ద్వారా రిపోర్ట్‌ను సరిచేయించుకోవచ్చు.
స్కోర్ తక్కువగా ఉంటే మెరుగుపరచండి
మీరు ఉన్న బకాయిలను చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచవచ్చు. అలాగే ఉన్న రుణాలు లేదా క్రెడిట్ కార్డులకు సంబంధించి రెగ్యులర్‌గా చెల్లింపులు చేయడంపై దృష్టి పెట్టండి. తిరిగి చెల్లించిన హిస్టరీ క్రెడిట్ స్కోర్‌లో ప్రధానమైన భాగం కాబట్టి, సమయానికి చెల్లింపులు చేయడం రుణదాతలకు మీ ఆర్థిక బాధ్యతలను సూచిస్తుంది.
ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫైనాన్స్ ఆమోద ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది.
2. ఫైనాన్స్ కోసం ప్రీ అప్రూవల్ (ముందుగానే ఆమోదం) పొందండి
కొత్త కారు ఫైనాన్స్ ఆమోద ప్రక్రియను వేగవంతం చేసుకోవడానికి ప్రీ అప్రూవల్ పొందడం ఒక ఉత్తమ మార్గం. అంటే రుణదాతలు ముందుగానే మీ ఆర్థిక వివరాలను పరిశీలించి మీకు ఎంత మొత్తం రుణం ఇవ్వాలి? ఎంత వడ్డీ రేటుతో ఇవ్వాలి? అనేది నిర్ణయించడం అన్నమాట. మీరు ప్రీ అప్రూవల్ పొందినప్పుడు కారు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు ఉంటుంది.
ప్రీ అప్రూవల్ వల్ల ప్రయోజనాలు
మీరు కారు కోసం షోరూమ్‌కు వెళ్లే సమయానికే మీకు ఎంత రుణం వస్తుందో తెలుస్తుంది... కాబట్టి ఎంత బడ్జెట్ లో కారు కొనాలో తెలుస్తుంది.
రుణానికి సంబంధించిన నిబంధనల గురించి ముందే అవగాహన ఉంటుంది కాబట్టి షోరూమ్ సిబ్బందితో డీల్ చేసేటప్పుడు మీకు అధిక ఆధిపత్యం ఉంటుంది.
మీరు రుణం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కారు కొనుగోలు ప్రక్రియను వారాల నుంచి కొన్ని రోజులకు తగ్గించుకోవచ్చు.
3. అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచండి
రుణదాతలు వేగంగా పని చేయగలగడం అన్నది వారికి కావాల్సిన సమాచారాన్ని మీరు ఎంత త్వరగా అందిస్తారనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీరు అందించాల్సిన పత్రాల్లో ఏవైనా మిస్ అయితే లేదా సమయానికి అందించకపోతే ఆమోద ప్రక్రియ నెమ్మదిస్తుంది.
రుణానికి కావాల్సిన ముఖ్యమైన పత్రాలు
గుర్తింపు పత్రాలు: మీ పేరు, వయస్సు, మరియు జాతీయత నిర్ధారించడానికి.
ఆదాయ వివరాలు: మీ ఆదాయాన్ని నిరూపించడానికి సాలరీ స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు.
నివాస ధ్రువీకరణ పత్రం: మీ చిరునామా ధృవీకరించడానికి.
ఈ పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకుంటే అదనపు ధృవీకరణలు లేదా పత్రాల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల ఫైనాన్స్ ఆమోద ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది.
4. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయండి
వీలుంటే ఎక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ చెల్లించండి. ఇది రుణ ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడంలో మీకు సహాయపడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ అంటే మీరు రుణదాత వద్ద తక్కువ మొత్తాన్ని కోరుకుంటున్నారని అర్థం. ఇది రుణదాతకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది కాబట్టి వెంటనే ఆమోదం లభిస్తుంది.
ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల ప్రయోజనాలు
రుణదాతలు మీ దరఖాస్తును త్వరగా ఆమోదించేందుకు ఆసక్తి చూపుతారు.
మీరు ఆర్థికంగా బాధ్యతగలవారని, కొనుగోలు సామర్థ్యం కలిగి ఉన్నారని చూపిస్తుంది.
సాధ్యమైనంత వరకు కార్ విలువకు 20% పైగా డౌన్ పేమెంట్ చేయడం ఉత్తమం.
ఇది మాత్రమే కాదు తక్కువ వడ్డీ రేట్లు, అనుకూలమైన నిబంధనల్ని పొందేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
5. తక్కువ కాలానికే ఈఎంఐ ఎంచుకొండి
తక్కువగా ఈఎంఐ చెల్లిస్తూ దీర్ఘకాల రుణాన్ని కొనసాగించడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ ఈఎంఐ తక్కువ కాలానికే పెట్టుకోవడం అనేది రుణ ఆమోదాన్ని వేగవంతం చేస్తుంది.
తక్కువ కాలం రుణం చెల్లించడంవల్ల ప్రయోజనాలు
తక్కువ కాలం ఈఎంఐ వల్ల రుణదాతకు తక్కువ ప్రమాదంగా కనిపిస్తుంది, ఎందుకంటే చెల్లింపు త్వరగా పూర్తవుతుంది.
దీర్ఘకాల రుణం కంటే తక్కువ కాల రుణం ఆమోదం పొందడం సులభం.
దీని ద్వారా మీ మొత్తం వడ్డీ చెల్లింపులు తగ్గిపోతాయి, మీరు రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు.
6. సరైన రుణదాతను ఎంచుకోండి
రుణదాత ఎంపిక మీరు రుణం ఎంత త్వరగా ఆమోదం పొందుతారన్న దానిపై ప్రభావం చూపుతుంది. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చలా వేగంగా ఫైనాన్స్ ప్రక్రియను పూర్తిచేస్తాయి... మరికొన్ని చాలా సమయం తీసుకుంటారు.
రుణదాతలను ఎంచుకునేముందు గమనించాల్సిన విషయాలు
ఆన్‌లైన్ రుణదాతలు, క్రెడిట్ సంస్థలు వేగవంతమైన ఆమోదాలతోపాటు తక్కువ పత్రాలతో ప్రక్రియను పూర్తిచేస్తాయి.
కొందరు రుణదాతలు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తారు, కానీ వాటి ప్రక్రియ నెమ్మది కావచ్చు.
మీకు వేగంగా కొత్త కారు ఫైనాన్స్ ఆమోదంపొందాలంటే ప్రముఖ రుణదాతలను పరిశీలించండి.
త్వరగా కొత్త కార్ ఫైనాన్స్ ఆమోదం పొందడం ఎందుకు ముఖ్యమో?
మీరు ఎన్నుకున్న కారు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా త్వరగా అందుకోవచ్చు.
ఉత్తమమైన వడ్డీ రేట్లను లాక్ చేయవచ్చు.
కారు కొనుగోలుకు మరింత సమయం, నిధులు అందుబాటులో వుంటాయి.
మీరు ఆర్థికంగా సిద్దంగా ఉన్నారని తెలుసుకోవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కొత్త కారు ఫైనాన్ పొందేందుకు రెడీగా వుండండి
అంతిమంగా మీ రుఐం తక్షణం ఆమోదం పొందేందుకు మీ క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించడం, ప్రీ-అప్రూవల్ పొందడం, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచడం ప్రారంభించండి. ఈ చర్యలు, మీ రుణ ప్రక్రియను వేగవంతం చేసి కొత్త కారు ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సహాయపడతాయి. ఇలా సరైన ప్రణాళికతో మీరు వేగంగా రుణాన్ని పొందడమే కాకుండా మంచి నిబంధనలను పొందుతారు.
