రానున్న పండుగ సీజన్‌పై అందరి దృష్టి పడింది. మరికొద్ది రోజుల్లో హాలీ డే సీజన్ రానుండడంతో షాపింగ్ చేసే కస్టమర్లు ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూసే అవకాశం ఉంది. కొన్ని రంగాలు రాబోయే రెండు నెలల్లో రికార్డు స్థాయి సేల్స్ అంచనా వేస్తున్నాయి.
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా వరుసగా రెండుసార్లు పండగల సీజన్‌లకు అంతరాయం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 26న నవరాత్రితో రానున్న పండుగ సీజన్‌పై అందరి దృష్టి పడింది. ఇతర పరిశ్రమలలోని బ్యాంకింగ్, ఆటోమోటివ్ ఇంకా రిటైల్ రంగాలు రాబోయే రెండు నెలల్లో రికార్డు స్థాయి సేల్స్ అంచనా వేస్తున్నాయి. .
ఆగస్ట్‌లో కన్జ్యూమర్ ద్రవ్యోల్బణం (7 శాతం) ఆర్‌బిఐ టాలరెన్స్ బ్యాండ్ (2–6 శాతం) కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా బ్యాంకులు 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లతో వాహన లోన్లు అందజేస్తూనే ఉన్నాయి. హాలీ డే సీజన్ రానుండడంతో షాపింగ్ చేసే కస్టమర్లు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూసే అవకాశం ఉంది. ఈ కింది పది బ్యాంకులు కొత్త కారు లోన్లను అతి తక్కువ వడ్డీ రేట్లకు ఇస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏడేళ్ల రీపేమెంట్ వ్యవధితో రూ. 10 లక్షల కొత్త కారు లోన్ కి 7.65 శాతం వడ్డీ రేటు విధిస్తుంది. ఈ లోన్ కోసం ఈఎంఐ రూ. 15,412 అవుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఏడేళ్ల కాలపరిమితితో రూ. 10 లక్షల కారు లోన్ పై దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ 7.9 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ఈ లోన్ ఈఎంఐ రూ. 15,536 అవుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కారు లోన్ పై 7.95 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ లోన్ ఈఎంఐ రూ. 15,561 అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా కారు లోన్ పై 7.95 శాతం వడ్డీ రేటును విధిస్తుంది.
కరూర్ వైశ్యా బ్యాంక్
కరూర్ వైశ్యా బ్యాంక్ ఏడు సంవత్సరాల రిపేమెంట్ వ్యవధితో రూ. 10 లక్షల కారు లోన్ పై 8 శాతం వడ్డీ రేటును అందిస్తూన్న రెండవ బ్యాంక్. ఈ బ్యాంక్ లోన్ ఈఎంఐ రూ. 15,586.
ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్ వాహన లోన్ పై 8% వడ్డీ రేటును విధిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాహన రుణాలపై 8.15 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. లోన్ తీసుకున్న వారు ఏడేళ్ల రీపేమెంట్ వ్యవధితో రూ.10 లక్షల కార్ లోన్‌పై రూ.15,661 ఈఎంఐ చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఏడేళ్ల కాలపరిమితితో రూ. 10 లక్షల కార్ లోన్‌లపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.2 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. లోన్ పేమెంట్ ఈఎంఐ రూ. 15,686.
యాక్సిస్ బ్యాంక్
ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కారు రుణాలపై 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్ల పై 8.25 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఈ బ్యాంక్ లోన్ ఈఎంఐ రూ. 15,711.
