నీతా అంబానీ బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచం మొత్తానికి సుపరిచితం. అయితే ఆమె చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారని మీకు తెలుసా..? ఆమె ఎన్నో భరతనాట్య ప్రదర్శనలను కూడా అందించారు.  

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ అండ్ వ్యవస్థాపకురాలు, ముంబై ఇండియన్స్ అధినేత నీతా అంబానీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న మహిళ. నీతా అంబానీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి..

 భరత నాట్య డ్యాన్సర్
నీతా అంబానీ బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచం మొత్తానికి సుపరిచితం. అయితే ఆమె చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారని మీకు తెలుసా..? ఆమె ఎన్నో భరతనాట్య ప్రదర్శనలను కూడా అందించారు. 

ధీరూభాయ్ అంబానీ ఒక ఈవెంట్‌లో నీతాను చూశారు. అక్కడే ఆమెని కోడలుగా అనుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ధీరూభాయ్ అంబానీ ఫోన్ చేయగా, ఎవరో తమాషా చేస్తున్నారని నీతా భావించి, 'నువ్వు ధీరూభాయ్ అంబానీ అయితే నేను ఎలిజబెత్ టేలర్‌ని' అని ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేసింది. నీతా తండ్రికి కాల్ వచ్చిన తర్వాతే నిజం తెలిసింది, ఆపై ధీరూ భాయ్ అంబానీ ఆమెను ఇంటికి పిలిచి కలిశారు. 

నీతా ముంబైలోని మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రవీంద్రభాయ్ దలాల్, పూర్ణిమా దలాల్. ఆమె సోదరి ఇప్పటికీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ముఖేష్ అంబానీని నీతా పెళ్లి చేసుకునే ముందు స్కూల్ టీచర్‌గా పని చేసేది.

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అండ్ చైర్‌పర్సన్ 
నీతా 2010లో రిలయన్స్ CSR డిపార్ట్మెంట్ ని స్థాపించారు. దీనిని గతంలో ధీరూభాయ్ అంబానీ ఫౌండేషన్ అని పిలిచేవారు. అంతే కాదు, ఆమె భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పాఠశాలలలో ఒకటైన ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు కూడా.

రిలయన్స్ బోర్డులో మహిళా డైరెక్టర్
నీతా అంబానీ 2014లో రిలయన్స్ బోర్డులో మొదటి మహిళా డైరెక్టర్ అయ్యారు. అంతే కాదు, 2016లో ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన ఉమెన్ బిజినెస్ లీడర్స్' లిస్ట్ లో నీతా పేరు వచ్చింది. 

డిజిటల్ టూల్స్ ద్వారా మహిళలకు సాధికారత కల్పించే రిలయన్స్ ఫౌండేషన్ చొరవలో భాగంగా 2022 మహిళా దినోత్సవం సందర్భంగా ' హర్ సర్కిల్' ని నీతా అంబానీ ప్రారంభించింది. 

IOC బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ 
2016లో, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బోర్డుకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళ నీతా అంబానీ.