దేశ రాజధాని ఢిల్లీ నుండి ముంబై బులియన్ మార్కెట్ వరకు, ఈ రోజు బంగారం స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ పసిడి మార్కెట్ కళకళలాడుతోంది. ఎందుకంటే బంగారం దాని గరిష్ట స్థాయి రూ. 4,700 నుండి చౌకగా విక్రయించబడుతోంది. బంగారం షాపింగ్ చేసే వారికి ఇది చాలా అనుకూలం.
హైదరాబాద్ లో ఈ ఉదయం బంగారం ధర రూ.100 స్వల్పంగా పెరిగింది. బుధవారం నాటికి, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,680 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,420గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) రూ. 50,510, బంగారం 22 క్యారెట్ల (10 గ్రాముల) రూ. 46,300 విక్రయించబడుతుంది. విజయవాడలో, 24 క్యారెట్ (10 గ్రాములు) ధర రూ. 50,510, 22 క్యారట్ల (10 గ్రాములు) ధర రూ. 46,300 విక్రయిస్తున్నారు. విశాఖ పట్నంలో 24 క్యారట్ల (10 గ్రాములు) ధర రూ. 50,510, 22 క్యారట్ల బంగారం (10 గ్రాములు) రూ. 46,300. గా విక్రయిస్తున్నారు.
చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. నెల్లూరులో బంగారం 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 50,510, 22 క్యారట్ల బంగారం (10 గ్రాములు) రూ. 46,300 గా ఉంది. గ్లోబల్ మార్కెట్ పతనం తర్వాత కూడా భారత్‌లోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం, ఎందుకంటే రాబోయే రోజుల్లో ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
మిస్డ్ కాల్ ద్వారా బంగారం ధర తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శని, ఆదివారాల్లో రేట్లు IBJA జారీ చేయడం లేదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. SMS ద్వారా రేట్లు అందుతాయి. ఇది కాకుండా, తరచుగా అప్‌డేట్‌ల గురించి సమాచారం కోసం, మీరు www.ibja.coని సందర్శించవచ్చు. ఇందులో బంగారం కొనే ముందు మీ నగరంలో ధరను తెలుసుకోవచ్చు.
