ముకేష్ అంబానీ కారుకు పెయింటింగ్ ఖర్చు 1 కోటి రూపాయలట.. వామ్మో ఇక కారు ధరెంతో ఊహించుకోండి..
భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ విలాసవంతమైన కార్ల భారీ సేకరణకు ఆయన ప్రసిద్ధి చెందారు. రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు, అంబానీ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉంది.
ఇటీవల ముఖేష్ అంబానీ ముచ్చటగా మూడో రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కొనుగోలు చేశారు. ఈ కారు ప్రత్యేకమైన కస్టమైజేషన్ కారణంగానే కాకుండా దాని ప్రత్యేక నంబర్ ప్లేట్ అధిక ధర కారణంగా వార్తల్లో నిలిచింది. అయితే ఇవన్నీ కాకుండా ఈ లగ్జరీ కారులో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. అది ఏంటంటే, ఈ కారు పెయింటింగ్ పనులకు కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు. సాధారణంగా, రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. అయితే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ పనులతో కారు ధర రూ.13.14 కోట్లకు పెరిగిపోయింది.
అంబానీ కుటుంబానికి చెందిన ఈ కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ కారు టస్కాన్ సన్ కలర్ షేడ్ కలిగి ఉంది. ఈ రంగు పెయింటింగ్ ధర రూ.1 కోటి కావడం విశేషం. కారు రిజిస్ట్రేషన్ నంబర్ '0001' కోసం రూ. 12 లక్షలు చెల్లించారు. ప్రస్తుత సిరీస్‌లోని అన్ని నంబర్‌లు ఉన్నాయి, కాబట్టి అంబానీ కుటుంబం కొత్త సిరీస్ నంబర్‌లను ఎంచుకుంది. దీనికి కూడా భారీ మొత్తం వెచ్చించారు. ఈ కారు రిజిస్ట్రేషన్ జనవరి 2037 వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ఖర్చులన్నింటికీ అదనంగా మరో రూ. 40,000 రోడ్డు భద్రతా పన్ను కూడా చెల్లిస్తారు.
కొన్ని నివేదికల ప్రకారం, ఈ కొత్త కారు ముఖేష్ అంబానీ కోసం కొనుగోలు చేయలేదు. ఈ కొత్త కారును అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌కి ఎంగేజ్‌మెంట్ బహుమతిగా ఇచ్చారనే టాక్ నడుస్తోంది. వారిద్దరూ జనవరి 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కారు కూడా అదే నెలలో రిజిస్టర్ చేయబడింది. భద్రతా కారణాల దృష్ట్యా ముఖేష్ అంబానీ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్నారు.
ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ఇంట్లో లగ్జరీ కార్ పార్కింగ్ కోసం భారీ స్థలాన్ని కేటాయించారు. యాంటిలియాలో కార్ పార్కింగ్ కోసం 400,000 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇది 158 అదనపు పెద్ద కార్లను పార్క్ చేయగలదు. యాంటిలియా హౌస్‌లో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. ఒక అంతస్తు పూర్తిగా కార్ పార్కింగ్‌కు డెడికేట్ చేశారు. అంబానీ కార్ల సేకరణలో బెంట్లీ బెంటెగాతో సహా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం Z+ కేటగిరీ భద్రతను కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కాన్వాయ్‌తో పాటు కదులుతారు. అంబానీకి ఎస్కార్ట్ వాహనంగా భద్రత కల్పించేందుకు రేంజ్ రోవర్‌ను పోలీసులకు అందించారు.