ప్రముఖ కార్టూనిస్ట్, పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్ తో పాపులర్ అయిన నిఖిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

నిఖిల్ ఆత్మహత్య ఆయన అభిమానులను ఎంతగానో కలవరపరిచింది. వ్యక్తిగత కారణాల వల్ల నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం నిఖిల్.. తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అన్ని చోట్లా గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా మంగళూరులోని మలెమార్ నగరంలోని ఆయన నివాసంలో నిఖిల్ చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నిఖిల్ పాయ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి  ‘ ది త్రీ హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్ ని 2009లో ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో లభించే ఆహార పదార్థాలు, వంటకాలపై నిఖిల్ రివ్యూలు రాసేవాడు. వాటి ద్వారా చాలా ఆదరణ సంపాదించుకున్నాడు.