టెస్లా భారత్ లో ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లేనా..ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో సాధించిన విజయలు ఇవే..
అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా ట్విట్టర్ అధినేత ఎలాన్ తో మస్క్ సైతం భేటీ అయ్యారు. ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, ప్రధాని మోదీ పర్యటన ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అలాగే కార్పొరేట్ దిగ్గజాలతో పలు దఫాలుగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో సైతం సానుకూల పవనాలు వీస్తున్నాయి. దీంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఆల్ టైం రికార్డ్ గరిష్ట సాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లలోకి 8.7 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇది ఇప్పటివరకు వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో గరిష్ట స్థాయి అని చెప్పవచ్చు. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడే కొద్ది పెద్ద ఎత్తున పరిశ్రమలు భారత్ కు తరలి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన మేకింగ్ ఇండియా నినాదానికి మరింత బలాన్ని ఇస్తుంది.
మరోవైపు ఎలక్ట్రిక్ కార్లలో సంచలనంగా మారిన టెస్లా ను త్వరలోనే భారత్ కు తీసుకొస్తామని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా పేర్కొనడం విశేషం. దీనిబట్టి అతి త్వరలోనే భారత్ లోకి మరో అతిపెద్ద విదేశీ పెట్టుబడి రాబోతున్నట్లు సూత్రప్రాయంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రధాని మోడీతో బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఫౌండర్ రే డాలియో సైతం భేటీ అయ్యారు. ఈ సంస్థ దేశంలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.
మరోవైపు భారత వైమానిక దళానికి సరికొత్త శక్తిని ఇచ్చేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలాగే జనరల్ ఎలక్ట్రిక్ మధ్య ఒప్పందానికి తెరలేవనుంది. ఈ ఒప్పందం ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసే యుద్ధ విమానాల్లో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసే అత్యంత సమర్థవంతమైన జెట్ ఇంజన్లను సరఫరా చేయనున్నారు. అంతే కాదు భారత్ లోనే ఈ జెట్ ఇంజన్ల తయారీకి టెక్నాలజీ బదిలీ చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్స్ కంపెనీ ఇప్పటికే సూత్రప్రాయంగా. ఆమోదం తెలిపింది దీనికి అమెరికా కాంగ్రెస్ నుంచి ఆమోదం మిగిలి ఉంది ప్రధాని మోదీ పర్యటనలో ఆమోదం కార్యరూపం దాల్చడం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా చైనా కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో తయారీ రంగం అక్కడ ఇంకా పడకేసింది. ఈ నేపథ్యంలో అమెరికా లాంటి దేశాలకు భారత్ తమ పెట్టుబడులకు స్వర్గధామంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో కరోనా తర్వాత భారత్ కన్నా వేగంగా మరి ఏ దేశము అభివృద్ధి సాధించలేదని చెబుతున్నారు. దీనికి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు మొత్తానికి ప్రధాని మోడీ అమెరికా పర్యటన మేకిన్ ఇండియా స్వప్నాన్ని సాకారం చేయడంలో అతిపెద్ద అడుగుగా భావిస్తున్నారు.