టెస్లా భారత్ లో భారీ పెట్టుబడులకు సిద్దమయ్యింది... ఇందుకోసమే ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటనకు సిద్దమయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పర్యటన సడన్ గా వాయిదా పడింది. 

ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఆయన మరో రెండురోజుల్లో భారత్ లో పర్యటించాల్సి వుండగా ఇప్పుడు వాయిదా పడింది. ఏప్రిల్ 22 ను మస్క్ భారత్ కు వస్తున్నట్లు చాలారోజుల కిందటే ప్రకటించారు... కానీ చివరి క్షణంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. 

తన భారత పర్యటన రద్దయినట్లు మస్క్ తన ఎక్స్ వేదికన ప్రకటించారు. టెస్లా బాధ్యతల్లో మునిగివున్నాను... చాలా పనులున్నాయి కాబట్టి భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. తన భారత పర్యటన ఆలస్యం అవుతుండటం దురదృష్టకరం... కానీ ఈ సంవత్సరం తర్వాత తప్పకూడా భారత్ లో పర్యటిస్తాను...అందుకకోసం ఎదురుచూస్తున్నానని ఎలాస్ మస్క్ వెల్లడించారు.

Scroll to load tweet…

 టెస్లా కార్లకు సంబంధించిన ఓ ప్లాంట్ భారత్ లో పెట్టే ఆలోచనలో ఎలాన్ మస్క్ వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్లాంట్ ను తమ రాష్ట్రంలోనే పెట్టాలని ముఖ్యమంత్రులు కోరుతున్నారు... ఇలా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కోరుతున్నారు. ఈ మేరకు టెస్లా ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. భారత పర్యటనలోనే టెస్లా పెట్టుబడుల గురించి మస్క్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన సడన్ గా భారత్ కు రావడంలేదని ప్రకటించారు.