Asianet News TeluguAsianet News Telugu

ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ కొత్త రికార్డు. మూడింట ఒక వంతు జాబ్స్ హైదరాబాద్‌లోనే రిక్రూట్ అవుతున్నాయి: కేటీఆర్

దేశంలో IT రంగంలో క్రియేట్ అవుతున్న కొత్త ఉద్యోగాల్లో  కేవలం హైదరాబాద్లోనే మూడింట ఒక వంతు రిక్రూట్ అయినట్లు, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి  కేటీఆర్ సగర్వంగా ప్రకటించారు.

Telangana is a new record in IT jobs One third of the jobs are being recruited in Hyderabad itself KTR
Author
First Published Dec 14, 2022, 10:16 PM IST

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో క్రియేట్ అయిన కొత్త ఉద్యోగాల్లో  కేవలం హైదరాబాద్లోనే మూడింట ఒక వంతు రిక్రూట్ అయినట్లు, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి  కేటీఆర్ సగర్వంగా ప్రకటించారు. గతేడాది  ఐటీ రంగంలో  4,50,000 కొత్త ఉద్యోగాలు ఏర్పడగా, అందులో 1,57,000 హైదరాబాద్‌లోనే సృష్టించబడ్డాయని తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమ, వాణిజ్య శాఖల మంత్రి కె.టి.రామారావు బుధవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు 2014-15లో రూ.57,000 కోట్లుగా ఉంటే 2021-22 నాటికి 1,83,000 కోట్లకు పెరిగాయని ఆయన తెలిపారు. 

హైదరాబాద్‌లో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ నూతన స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్, తెలంగాణ  పరిశ్రమల పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయంగా మారాయని కేటీఆర్ అన్నారు. "అభివృద్ధికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని తెలిపారు. అలాగే హైదరాబాద్  నగరం తమ ప్రభుత్వ అభివృద్ధికి, గౌరవ ముఖ్యమంత్రి , నిబద్ధతకు నిజమైన నిదర్శనం" అని ఆయన అన్నారు.

 

నగరంలో పెట్టుబడి పెట్టే పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు స్థానిక యువతలోని ఇన్నోవేటివ్ శక్తి,  సమృద్ధి కారణంగా ఎక్కువ మంది ప్రతిభావంతులను నియమించుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాష్ గ్లోబల్ ఫిబ్రవరి ఈ తాజా ఫెసిలిటీ ఏర్పాటు చేసి 3,000 మందిని రిక్రూట్ చేసుకున్నట్టు ప్రకటించిందని గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అని ఆటోమొబైల్ టెక్నాలజీతో సహా అనేక రంగాలలో పెట్టుబడులకు తెలంగాణ చాలా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. గత ఎనిమిదేళ్లలో జెడ్‌ఎఫ్, ఫిస్కర్, స్టెల్లాంటిస్, హ్యుందాయ్, బిలిటీ తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని ఆయన సూచించారు.

Qualcomm , Amazon , Google , Uber , Microsoft వంటి ప్రస్తుత ఆటగాళ్ళు తమ కార్యకలాపాలను విస్తరించినట్లు గుర్తు చేశారు. USలోని తమ ప్రధాన కార్యాలయం వెలుపల వారి అతిపెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్ లో. ఉన్నాయని గుర్తు చేశారు.  

మహీంద్రా, MRF, Olectra, Mythra , Race Energy వంటి హోమ్ కంపెనీలు కూడా తెలంగాణలో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశాయని కేటీఆర్ తెలిపారు. ఒక దశాబ్దం క్రితం 400 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన నోవార్టిస్ ఇప్పుడు 9,000 మంది ఉద్యోగులకు పెరిగింది , ఇది వారి రెండవ అతిపెద్ద క్యాంపస్‌గా మారింది.

తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తోందని, ఇందులో ఈవీ తయారీదారులు, బ్యాటరీ తయారీదారులు, రీసైక్లర్లు  వంటి ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ క్లస్టర్‌లో ఇంజనీరింగ్, బ్యాటరీ టెస్టింగ్, తయారీ, ఆవిష్కరణలు కోసం నియమించబడిన జోన్‌లు ఉంటాయి.
 
ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమిచ్చే ప్రయత్నాల్లో భాగంగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్ తన మొట్టమొదటి ఫార్ములా ఇ రేసును నిర్వహించనుంది. EV వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడానికి నగరం EV సమ్మిట్‌ను కూడా నిర్వహిస్తుందని తెలిపారు. 

కొత్త 1.5 లక్షల చదరపు అడుగుల ఫెసిలిటీ ద్వారా 3,000 మందికి పైగా ఉపాధి కల్పించడంతో పాటు, బాష్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ డొమైన్‌లో తన ఉనికిని బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత , ఆవిష్కరణ R&D కేంద్రం ఆటోమోటివ్ ఇంజనీరింగ్ , డిజిటల్ ఎంటర్‌ప్రైజ్‌పై దృష్టి సారించింది. 

ఈ సదుపాయం క్లాసికల్ పవర్‌ట్రెయిన్, ఆటోమోటివ్ స్టీరింగ్, ఇ-మొబిలిటీ, క్రాస్ డొమైన్ కంప్యూటింగ్ (ADAS, అటానమస్ డ్రైవింగ్), యాక్టివ్ , పాసివ్ సేఫ్టీపై పని చేస్తుందని Bosch Global Software Technologies (BGSW) హైదరాబాద్ సెంటర్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సుందర రామన్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios