తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త ఏంటంటే జనవరి 1న సెలవు దినం ప్రకటించినందున నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రతి నెలలో రెండో శనివారం సెలవు దినంగా పరిగణించే ప్రభుత్వ కార్యాలయాలు నేడు అంటే ఈ రోజున రెండో శనివారాన్ని సెలవును రద్దు చేసింది.

also read ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

అలాగే నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో పనులు ఎప్పటి రోజులాగే జరుగుతాయని తెలిపింది. ఈ నెల 8వ తేదీ రెండో శ‌నివారాన్ని ప‌నిదినంగా ప‌రిగ‌నించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా  జారీ చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

జ‌న‌వ‌రి 1వ తేదీని సెల‌వు దినంగా ప్ర‌క‌టించినందున, దానికి బ‌దులుగా ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ రెండో శ‌నివారం రోజున అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌నిచేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిపారు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు అన్ని జోన‌ల్‌, స‌ర్కిల్ కార్యాల‌యాలు య‌దావిధిగా ప‌నిచేయాల‌ని తెలిపారు.

also read అలాంటి యాడ్స్ పై ఇక నుంచి 50 లక్షల జరిమానా, ఐదు ఏళ్ల జైలు శిక్ష....

ఈ అంశంపై జోన‌ల్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, హెచ్‌.ఓ.డిలు త‌మ ప‌రిధిలోని ఉద్యోగుల‌కు త‌గు ఆదేశాలు వెంటనే  జారీ చేయాల‌ని సూచించారు. గతంలో కూడా ప్రభుత్వం ఇలాగే రెండో శనివారం సెలవులను రద్దు చేసింది. దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు నిరవధికంగా విధులను బహిష్కరించారు.

ఆ సమయంలో ప్రభుత్వం కొన్ని రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత స్కూళ్లు సెలవుల కాలంలో ఆగిపోయిన పాఠాలను పూర్తి చేసేందుకు ఆ తర్వాత రెండో శనివారాల్లో కూడా స్కూళ్లు తెరిచి ఉంచాలని ఆదేశించింది. విధులను బహిష్కరణ, సమ్మే ఇలాంటి వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలవులను రద్దు చేసి పనిదినాలుగ ఆదేశాలు జారీ చేస్తున్నారు.