తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6 శుక్రవారం రోజున ప్రారంభమయ్యాయి. తొలిసారిగా తెలంగాణ గవర్నర్ తమిళిసాయి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమే ప్రసంగించారు. ఇక 2020-21 వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో ప్రవేశపెట్టనుంది.

also read కొత్త చట్టాల అమలుతో నేడు 11:30కి తెలంగాణ బడ్జెట్

ఉదయం 11:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 9న హోలీ పండగ రావడంతో ఒక్కరోజు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్‌ ప్రధానంగా రైతు సంక్షేమ బడ్జెట్‌గా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

అదే సమయంలో కరోనా వైరస్‌పై పోరుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏమైనా కేటాయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేస్తుందో వేచి చూడాల్సిందే. బడ్జెట్ లో రైతు సంక్షేమానికే సి‌ఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

also read  ప్రజల అకాంక్షలు...హామీలే ప్రధానం: 8న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ బడ్జెట్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.1.56 నుంచి రూ.1.59 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ది లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందు 2019-2020లో బడ్జెట్ సమావేశంలో రూ.1.46 లక్షల కోట్లు కాగా ఇసారి 15నుంచి 16 శాతం బడ్జెట్ వ్యయం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.