Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ ఎఫెక్ట్: తగ్గిన టీవీ, ఫ్రిజ్‌ల ధరలు.. ఆర్థికశాఖ ఉవాచ

కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక టీవీ, రిఫ్రిజరేటర్‌ (ఫ్రిజ్‌), వాషింగ్‌మెషీన్‌ తదితర ఉత్పత్తుల ధరలు తగ్గాయని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. గతంలో వీటిపై 31% పన్ను అమలైతే, జీఎస్టీలో 18 శాతం మాత్రమే వసూలు చేయడం దీనికి కారణమని తెలిపింది. ఎయిర్‌ కండిషనర్లు, వాహనాలపై కూడా పన్నురేట్లు తగ్గాయని వివరించింది. ప్రస్తుతం 34 రకాల విలాస వస్తువులు మాత్రమే 28% పన్నురేటులో ఉన్నాయని పేర్కొంది. 
 

Tax on TV, fridge, commonly used household items came down post GST: FinMin report
Author
New Delhi, First Published Dec 19, 2018, 10:35 AM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక టీవీ, రిఫ్రిజరేటర్‌ (ఫ్రిజ్‌), వాషింగ్‌మెషీన్‌ తదితర ఉత్పత్తుల ధరలు తగ్గాయని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. గతంలో వీటిపై 31% పన్ను అమలైతే, జీఎస్టీలో 18 శాతం మాత్రమే వసూలు చేయడం దీనికి కారణమని తెలిపింది. ఎయిర్‌ కండిషనర్లు, వాహనాలపై కూడా పన్నురేట్లు తగ్గాయని వివరించింది. ప్రస్తుతం 34 రకాల విలాస వస్తువులు మాత్రమే 28% పన్నురేటులో ఉన్నాయని పేర్కొంది. 

వాస్తవంగా 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక, వీటిపై అమలవుతున్న పన్నురేటు కూడా గతానికంటే తగ్గిందని ఆర్థిక శాఖ తెలిపింది. దేశం అంతటా ఒకే పన్నురేటు విధించడంతో ఒకే మార్కెట్‌గా తీర్చిదిద్దడంతోపాటు పన్నుపై పన్ను విధించే విధానానికి స్వస్తి పలకడం కూడా జీఎస్టీ అమలు ఉద్దేశమని స్పష్టం చేసింది. 

గతంలో ఫ్యాక్టరీల్లో వస్తువు ఉత్పత్తి చేసేప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తే, దానిపై రాష్ట్రాలు వాల్యూయాడెడ్ టాక్స్ (వ్యాట్‌) విధించేవి. అంటే వస్తువు ధరతో పాటు ఎక్సైజ్‌ సుంకంపైనా పన్నును వినియోగదారులు చెల్లించాల్సి వచ్చేదని గుర్తు చేసింది. జీఎస్టీ విధానంలో ఈ పద్ధతులు పూర్తిగా తొలగించి వస్తువు వినియోగంపై మాత్రమే పన్ను విధిస్తున్నారు. 

వివిధ రకాల ఉత్పత్తులు, సేవలపై 0, 5, 12, 18, 28 శాతం జీఎస్టీ రేట్లు అమల్లో ఉన్నాయి. ఎక్సైజ్‌, సేల్స్‌ట్యాక్స్‌ సహా 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులను మిళితం చేసి, జీఎస్టీని కలిపేశారు. నిత్యావసరాలపై పన్ను లేకపోగా, విలాసవంత ఉత్పత్తులు, హానికారక వస్తువులపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.

27 అంగుళాల తెర కలిగిన టెలివిజన్లు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌మెషీన్లు, మిక్సీలు, జ్యూసర్లు, వ్యాక్యూమ్‌క్లీనర్‌, గీజర్‌, ఫ్యాన్‌, కూలర్‌, వాచీలపై గతంలో 31.3 శాతం పన్నురేటు ఉండేదని, ఇప్పుడు 18 శాతమేనని ఆర్థికశాఖ గుర్తు చేసింది. 

అలాగే మొబైల్‌ఫోన్లపైనా విధిస్తున్న 18-25 శాతం పన్ను 12 శాతానికి తగ్గిందని, గృహ సామగ్రి (ఫర్నిచర్‌)పై 25-31 శాతం పన్ను 18 శాతానికి దిగి వచ్చిందని ఆర్థిక శాఖ విశ్లేషించింది. 

ఇక విలాసవంత ఉత్పత్తులు, వాహనాలు, సిమెంట్‌, ఎయిర్‌ కండిషనర్లు, డిష్‌వాషర్లు, డిజిటల్‌ కెమేరాలు, వీడియోగేమ్‌ కన్సోల్‌, మానిటర్లు, ప్రొజెక్టర్లపైనా పన్ను 31.30 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది. సినిమా టికెట్‌ ధర రూ.100 కన్నా అధికంగా ఉంటే, గతంలో పన్ను 35 శాతం అయ్యేది. ఇది 28 శాతానికి తగ్గింది. 

ఫైవ్ స్టార్‌ హోటల్‌లో గది తీసుకుంటే, విధించే 30-50 శాతం పన్ను ఇది 28 శాతానికి తగ్గింది. కాగా, ఈ వారాంతంలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలోనూ 28 శాతం పన్ను రేట్ కొనసాగుతున్న వస్తువుల సంఖ్య తగ్గించే అవకాశం ఉన్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios