Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ ఇండియాకి రిఫైనాన్స్ ఇచ్చేందుకు ఎస్‌బి‌ఐ రెడీ.. టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లడంతో కిలక నిర్ణయం..

ఒక్కప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాని టాటా సన్స్ తాజాగా తిరిగి చేజిక్కిచుకుంది. దీంతో ఎయిర్ ఇండియా దశాబ్దాల తరువాత సొంత గూటికి చేరినట్టైంది. సమాచారం ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. 

Tatas gets loan commitment from SBI-led consortium for Air India
Author
Hyderabad, First Published Jan 28, 2022, 5:56 AM IST

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లడంతో నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఎయిరిండియా సజావుగా సాగేందుకు టాటా సన్స్‌కు ఈ రుణాన్ని అందజేస్తామని తెలిపింది.  

గతేడాది అక్టోబర్‌లో ఎయిర్‌ ఇండియా, ఏఐఎస్‌ఏటీఎస్‌(AISATS)లో 50 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో కలిసి టాటా గ్రూప్‌ విజయం సాధించింది. ఈ బృందం అధికారికంగా విమానయాన సంస్థను కొనుగోలు చేసింది. ఎస్‌బిఐ నేతృత్వంలోని కన్సార్టియం ఎయిర్ ఇండియా అవసరాలకు అనుగుణంగా ఫిక్సెడ్ టర్మ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ రెండింటినీ అందించడానికి అంగీకరించిందని నివేదికలు తెలిపాయి.

ఏ బ్యాంకులు కన్సార్టియంలో భాగంగా ఉన్నాయి?
సమాచారం ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ఎస్‌బి‌ఐ కన్సార్టియంలో భాగంగా ఉన్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8 అక్టోబర్ 2021న అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసే బిడ్‌ను గెలుచుకుంది.

ఎయిరిండియా టాటా చేతుల్లోకి వెళ్లిన తర్వాత చాలా బ్యాంకులు ఎయిర్‌లైన్స్‌కు రుణం ఇచ్చేందుకు అంగీకరించాయని, ఆ కంపెనీకి మళ్లీ రీఫైనాన్స్ చేసేందుకు సిద్ధంగా లేని పాత రుణదాతలు తాజాగా రుణాలు అందజేస్తామని ఓ బ్యాంకర్ తెలిపారు. ముఖ్యంగా నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు ఎల్‌ఐసీ గతంలో రుణం ఇచ్చింది. 

ఎయిర్ ఇండియాపై అప్పు ఎంత?
ఎయిర్ ఇండియా అప్పుల గురించి మాట్లాడితే, 31 ఆగస్టు 2021 వరకు ఎయిర్‌లైన్‌పై మొత్తం అప్పు 61 వేల 562 కోట్లు. ఈ రుణంలో 75 శాతం (46262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ (AIHL)కి బదిలీ అయిన తర్వాత టాటా గ్రూప్‌కు అందజేసారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో ఎయిర్ ఇండియా విలీనం తర్వాత, ఈ ఎయిర్‌లైన్ 2007-08 సంవత్సరం నుండి నష్టాలను చవిచూడటం ప్రారంభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios