ఇండియాలో అభివృద్ధి చెందుతున్న టెక్ రంగంలోకి టాటా గ్రూప్ కొత్త “సూపర్ యాప్” తో  ప్రవేశిస్తోంది, ఇది మొదటిసారిగా వినియోగదారులకు సేవలను కలిపిస్తుంది. దీని ద్వారా ప్రతిదీ ఆర్డర్ చేయవచ్చు, డిసెంబర్ లేదా జనవరి నుండి భారతదేశంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ఇతర ప్రత్యర్థులతో తలపడటానికి మార్కెట్లో రానుంది. ముఖేష్ అంబానీ యజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఫేస్ బుక్, గూగుల్ సహా 13 విదేశీ పెట్టుబడిదారుల నుండి 20 బిలియన్లను సేకరించిన కొద్దికాలానికే టాటా ప్రణాళికలు వచ్చాయి.

మొబైల్ ఆపరేటర్ జియో ఇ-కామర్స్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ వరకు ప్రతిదానికీ విస్తరిస్తుంది. టాటా సంస్థ స్టీల్ ప్లాంట్లు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల తయారీ కూడా కలిగి ఉంది, ఇప్పటివరకు ఇంటర్నెట్ సమర్పణలలో వెనుకబడి ఉంది.

also read వరుసగా మళ్ళీ పెరిగిన పెట్రోల్‌ ధర.. నేడు ఎంతంటే ? ...

దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు  తెలుస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య చైనా టెక్ కంపెనీలను పరిమితం చేయడానికి భారత అధికారులు తీసుకున్న చర్య కూడా పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచింది.

కొత్తవారికి అవకాశాలను సృష్టించింది. సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. 4

భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు.