టాటా టియాగో CNG కారు కేవలం రూ. 52 వేలకే కొనే అవకాశం..మైలేజీ, ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతేయడం ఖాయం...
టాటా మోటార్స్ నుంచి సిఎన్జి కార్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్య టాటా టియాగో నుంచి విడుదలైన సిఎన్జి కారులో అతి తక్కువ ధరకే డౌన్ పేమెంట్ చెల్లించి ఫైనాన్స్ ప్లాన్లో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో చాలామంది ప్రత్యామ్నాయ ఇం ఇంధనంతో నడిచే వాహనాల వైపు దృష్టిసారిస్తున్నారు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా. చార్జింగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు చార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ఫ్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అందుకే ప్రజలు సిఎన్జి కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. . ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కూడా సిఎన్జి వేరియంట్ కారులను మార్కెట్లో విడుదల చేసింది.
ప్రస్తుతం టాటా టియాగో CNG గురించి మాట్లాడుకుందాం. ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని ప్రముఖ కార్లలో ఒకటి అని చెప్పవచ్చు. టియాగో దాని డిజైన్, ఫీచర్లు, మైలేజ్, సరసమైన ధరల కారణంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది.
టాటా టియాగో సిఎన్‌జి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయడానికి సులభమైన ఫైనాన్స్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదేంటో తెలుసుకుందాం. టాటా టియాగో సిఎన్‌జి బేస్ మోడల్ ధర రూ. 6,43,900 (ఎక్స్-షోరూమ్) ఆన్-రోడ్ రూ. 7,27,161 వరకు ఉంది.
టాటా టియాగో CNG ఫైనాన్స్ ప్లాన్
టాటా టియాగో సిఎన్‌జిని కొనుగోలు చేయడానికి ఒకే సారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేము అనుకుంటే, ఫైనాన్స్ ప్లాన్ ద్వారా, ఈ కారును కేవలం రూ. 52 వేలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
ఆన్‌లైన్ ఫైనాన్స్ ప్లాన్‌ను వివరించే డౌన్ పేమెంట్ , EMI కాలిక్యులేటర్ ప్రకారం, మీ వద్ద రూ. 52,000 బడ్జెట్ ఉంటే, మీరు ఈ కారు కోసం నెలవారీ EMI చెల్లించగలిగితే, దీని ఆధారంగా బ్యాంక్ 9.8 శాతం వార్షిక వడ్డీ రేటుతో మీకు ఆన్ రోడ్ ధరపై 90 శాతం వరకూ లోన్ ఇస్తుంది.
టాటా టియాగో సిఎన్‌జిపై రుణం జారీ చేసిన తర్వాత, ఈ కారు డౌన్‌పేమెంట్ కోసం 60 వేల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత నెలవారీ రూ. 14,279 ఇఎంఐని, 5 సంవత్సరాల వ్యవధిలో చెల్లించాలి.
Tata Tiago XE CNG ఇంజిన్, మైలేజీ
టాటా టియాగో సిఎన్‌జి 1199సిసి ఇంజన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72బిహెచ్‌పి పవర్, 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాటా టియాగో XE CNG మైలేజ్
మైలేజీకి సంబంధించి, ఈ హ్యాచ్‌బ్యాక్ ఒక కిలో సిఎన్‌జిపై 26.49 కిమీ మైలేజీని ఇస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. ఈ మైలేజీని ARAI ధృవీకరించింది.
టాటా టియాగో XE CNG ఫీచర్లు
టాటా టియాగో సిఎన్‌జిలో ఉన్న ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు సీటుపై డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.