Tata motors: టాటా మోటార్స్ బంఫర్ ఆఫర్.. గిఫ్ట్‌గా రూ.5 లక్షల బంగారం
పండుగల సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడం వెనుక బడ్డ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తాజాగా మరో వినియోగదారులకు అద్భుత ఆఫర్ ముందుకు తెచ్చింది.
ముంబై: పండుగల సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడం వెనుక బడ్డ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తాజాగా మరో వినియోగదారులకు అద్భుత ఆఫర్ ముందుకు తెచ్చింది. టాటా మోటార్స్ ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల ఎస్‌యూవీ మోడల్ కారు గానీ, పిక్ అప్ ట్రక్ కొనుగోలు చేసిన వినియోగదారులకు అద్భుతమైన బహుమతిని గెలచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు..మేలుకోకుంటే సొమ్ము మాయం
టాటామోటర్స్ ఎస్‌యూవీ కారు, పిక్ అప్ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు టీవీ, వాషింగ్ మెషీన్, మిక్సీ తదితర గిఫ్ట్‌లను అందిస్తామని సంస్థ వివరించింది. తద్వారా వినియోగదారులలో మరోసారి దీపావళీ వెలుగులు నింపనున్నామని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తప్పనిసరి బహుమతితోపాటు సుమారు రూ. 5లక్షల విలువైన బంగారాన్ని ఈ ఆఫర్‌లో గెలుచుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఆఫర్ 30న ముగుస్తుందని సంస్థ తెలిపింది. పండుగల సీజన్ తరువాత తాము అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాల్సిందిగా సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఆర్బీఐ మేకిట్ క్లియర్.. జనవరి నుంచి నో ‘నిఫ్ట్’ చార్జెస్
టాటా హెక్సా కారుపై అత్యధికంగా రూ.1.1 లక్షలు, టాటా సఫారీ స్టోర్మ్ కారుపై రూ.75 వేలు, టాటా హారియర్ కారుపై రూ.70 వేలు, టాటా బోల్ల్, టాటా జెస్ట్ మోడళ్లపై రూ.70 వేలు, టాటా టిగోర్ కారుపై రూ.62 వేలు, టాటా నెక్సాన్ కారుపై రూ.52,500, టాటా టియోగో కారుపై రూ.45 వేల ఆదా చేసుకునే అవకాశాన్ని టాటా మోటార్స్ అందిస్తోంది.