Asianet News TeluguAsianet News Telugu

Tata Steel Merger: టాటా గ్రూపు కీలక నిర్ణయం, 7 మెటల్ కంపెనీలు టాటా స్టీల్‌లో విలీనం..

దేశంలోని ప్రముఖ స్టీల్ కంపెనీ టాటా స్టీల్‌లో టాటా గ్రూపునకు చెందిన  మెటల్ సంస్థలను దానితో విలీనం చేసే ప్రణాళికకు ఆమోదం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆ ప్రకటనలో తెలిపారు. టాటా స్టీల్ విడుదల చేసిన ఈ ప్రకటనలో ఈ మెటల్ అనుబంధ సంస్థల ప్రతిపాదిత విలీనానికి సంబంధించిన ప్రణాళికలను టాటా స్టీల్ డైరెక్టర్ల బోర్డు పరిశీలించి ఆమోదించింది.

Tata group key decision 7 metal companies merged into Tata Steel
Author
First Published Sep 23, 2022, 5:58 PM IST

ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్ లో పనిచేసే మెటల్ కంపెనీలన్నిటిని టాటా స్టీల్ కిందే పని చేసేలా ఏడు కంపెనీల విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్లకు సమాచారం తెలిపింది. సదరు కంపెనీల వ్యయాలను తగ్గించడం కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. కాగా గురువారం జరిగినటువంటి బోర్డు సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్లకు ఫైలింగ్ చేయడం ద్వారా టాటా గ్రూప్ తెలిపింది.  

ఈ ప్రతిపాదన వివరాల్లోకి వెళితే టాటా గ్రూప్‌లోని  మెటల్ కంపెనీలన్నీ ఇకపై టాటా స్టీల్‌లో విలీనం కానున్నాయి.  దీని ప్రకారం, టాటా గ్రూప్‌లోని మెటల్ కంపెనీలు ఇప్పుడు టాటా స్టీల్ కిందకు వస్తాయి. ఈ సమాచారం స్టాక్ మార్కెట్ రెగ్యులేర్లకు ఫైలింగ్ చేయగానే ఈరోజు స్టాక్ మార్కెట్‌లో టాటా స్టీల్ స్టాక్‌లో బలమైన పెరుగుదల నమోదు చేసింది.  ఆరు అనుబంధ సంస్థలను తమతో విలీనం చేసే ఆలోచనకు అన్ని కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపినట్లు టాటా స్టీల్ సెబీకి తెలియజేసింది. శుక్రవారం ఒక ప్రకటనలో, దీనికి సంబంధించిన ప్రతిపాదనను నిన్న కంపెనీ బోర్డు ఆమోదించినట్లు సమాచారం.

టాటా స్టీల్‌తో ఆరు అనుబంధ సంస్థల విలీనానికి సంబంధించిన ప్రణాళికలను టాటా స్టీల్ డైరెక్టర్ల బోర్డు పరిశీలించి, ఆమోదించిందని టాటా స్టీల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. టాటా స్టీల్  అనుబంధ సంస్థ TRF లిమిటెడ్ (34.11 శాతం వాటా)ని టాటా స్టీల్ లిమిటెడ్‌తో విలీనానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

టాటా స్టీల్ లో విలీనం అవుతున్న కంపెనీల పేర్లు ఇవే..
టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్., ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్., టాటా మెటాలిక్స్ లిమిటెడ్, ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్., టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్. ఎస్&టి. మైనింగ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాటా స్టీల్ సంస్థలో విలీనం అవుతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. 

ఈ కంపెనీలలో టాటా స్టీల్‌కు ఎంత వాటా ఉందో తెలుసుకోండి 
టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో టాటా స్టీల్‌కు 74.91 శాతం వాటా ఉంది. ఇది కాకుండా, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 74.96 శాతం, టాటా మెటాలిక్స్ లిమిటెడ్‌లో 60.03 శాతం, ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 95.01 శాతం, టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్, ఎస్‌అండ్‌టి మైనింగ్ కంపెనీ లిమిటెడ్ రెండూ టాటా గ్రూపు వారివే.  

Follow Us:
Download App:
  • android
  • ios