సారాంశం

భారతదేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ఏ నగరంలో నివసిస్తున్నారు? వారి విలాసవంతమైన గృహాలు ఎక్కడ ఉన్నాయి? పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. 

భారతదేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో చాలామంది ముంబైలో విలాసవంతమైన గృహాలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. మరికొందరు బెంగళూరుతో సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోని విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. అంబానీ, అదానీ, టాటా, బిర్లా వంటి సంపన్న వ్యాపారవేత్తలు నివసించే దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలు, వారి ఇళ్ల వివరాలను తెలుసుకుందాం. 

అంటిలియా - ముఖేష్ అంబానీ
భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కుటుంబం ముంబైలో నివాసం ఉంటోంది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరు. అతను ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్‌లోని 27 అంతస్తుల విలాసవంతమైన ఇల్లు 'ఆంటిలియా'లో నివసిస్తున్నాడు. 'ఆంటిలియా' దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఇంటిని దాదాపు 11 వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. ఆంటిలియాలో దేవాలయం, థియేటర్,3 అంతస్తుల పార్కింగ్, మూడు హెలిప్యాడ్‌లతో సహా అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి.

Colaba - రతన్ టాటా
టాటా గ్రూప్ అధిపతి, ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా కూడా ముంబైలో ఉంటారు. కొలాబాలోని రతన్ టాటా నివసించే  వైట్ హౌస్ కళాత్మకతకు దర్పణం. 150 కోట్లు ఈ విలువైన ఈ బంగ్లా అరేబియా సముద్రానికి అభిముఖంగా నిర్మించారు. ఈ ఇంటి నుంచి సముద్రపు అందం కనిపిస్తుంది. ఏడు అంతస్తుల ఇల్లు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంటి చివరి అంతస్తులో పెద్ద నీటి ఫౌంటెన్ ఉంది. స్విమ్మింగ్ పూల్, సన్ డెక్, సినిమా హాల్,  10 వాహనాల కోసం పార్కింగ్ ఏరియా ఈ ఇంటిలోని మరో విశేషం. ముంబైలోని అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఇది ఒకటి.

అదానీ హౌస్
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ గౌతమ్ అదానీకి అహ్మదాబాద్‌లో ఇల్లు ఉంది. ఇటీవలే  ఢిల్లీలో విలాసవంతమైన ఇల్లు కూడా కొనుగోలు చేశారు. దాదాపు 3.4 ఎకరాల్లో ఈ ఇంటిని నిర్మించారు. దీని విలువ రూ.400 కోట్లు.

అదార్ పూనావాలా
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ,  CEO అయిన అదార్ పూనావాలా ముంబైలోని సల్సిబూర్ పార్క్‌లో 22 ఎకరాల స్థలంలో విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్నారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంటాయి,  యూరోపియన్ టచ్ కలిగి ఉంటుంది. 

కుమార్ మంగళం బిర్లా
బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా మలబార్ హిల్‌లో వ్యాపారవేత్తలు అరుణ్ ఎమ్ జాటియా ,  శ్యామ్ ఎమ్ జాటియా నుండి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటి విలువ రూ.425 కోట్లు. ఈ ఇల్లు 2,926 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 

ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ముంబైలోని మలబార్ హిల్ సమీపంలోని గులిస్తాన్ అనే ఇంటిలో నివసిస్తున్నారు. ఇల్లు మూడు అంతస్తులు ,  13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.