Asianet News TeluguAsianet News Telugu

Syrma SGS Technology IPO Listing: సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ ఐపీవో బంపర్ లిస్టింగ్, ఇష్యూ పై 34 శాతం రిటర్న్

Syrma SGS Technology IPO ఇన్వెస్టర్లకు బంపర్ లిస్టింగ్ లాభాలను అందించింది. BSE, NSEలలో దాదాపు 19 శాతం ప్రీమియంతో లిస్టింగ్ చేయబడింది. లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే, Syrma  SGS Technology షేర్లలో బంపర్ ర్యాలీ జరిగింది. కంపెనీ షేర్లు BSEలో రూ. 262 వద్ద ప్రారంభమయ్యాయి.  తర్వాత దాదాపు 35 శాతం పెరిగి వారి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ. 295కి చేరుకుంది.
 

Syrma SGS Technology IPO Listing  details
Author
First Published Aug 26, 2022, 1:46 PM IST

Syrma SGS Technology IPO Listing: సిర్మా SGS టెక్ షేర్లు ఈరోజు స్టాక్ మార్కెట్‌లో బంపర్ లిస్టింగ్‌ జరిగింది.  IPO కింద గరిష్ట  బ్యాండ్  ధర రూ. 220 కాగా, BSEలో Syrma SGS Technology రూ. 262 వద్ద లిస్టింగ్ అయ్యాయి. అంటే,19 శాతం ప్రీమియంతో  లిస్టింగ్ అయ్యిందని అర్థం.  అదే సమయంలో,  లిస్టింగ్  తర్వాత Syrma SGS Technology ధర  రూ.295కు చేరుకుంది. అంటే, ఇష్యూ ధర కంటే 34 శాతం బలమైన రిటర్న్ ఇచ్చింది. ఇష్యూ పరిమాణం రూ.840 కోట్లు కాగా, ఈ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. నిపుణులు, బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ IPOలో పెట్టుబడి పెట్టడానికి పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. 

IIFL, VP-రీసెర్చ్, అనూజ్ గుప్తా మాట్లాడుతూ Syrma SGS టెక్  వాల్యుయేషన్ కరెక్ట్ గానే కనిపిస్తోందన్నారు. కంపెనీ వ్యాపారం కూడా బాగానే ఉంది. అయినప్పటికీ, టెక్ వ్యాపారంలో ఇంకా పూర్తి రికవరీ పుంజుకోలేదని, రెండవది, మార్కెట్ సెంటిమెంట్లు చాలా బలంగా లేవని అన్నారు. అయితే కొత్తగా సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయ్యాక షేర్లను కొనాలి అనుకుంటే మాత్రం కొంత కాలం వెయిట్ చేయాలన్నారు. ఎందుకంటే  స్టాక్ ఇష్యూ ధర నుండి 10 నుండి 15 శాతం తగ్గినట్లయితే, పోర్ట్‌ఫోలియోకు జోడించుకోమని సూచించారు. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మెరుగ్గా ఉంటుందని సూచించారు. షేర్లు అలాట్ మెంట్ అయినవారు ప్రాఫిట్ బుకింగ్ కోసం కొన్ని షేర్లను అమ్ముకొని, మిగితావి హోల్డ్ చేసుకోవాలని సూచించారు. 

Syrma SGS Technology IPO Listing: సిర్మా SGS టెక్నాలజీ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో, 50 శాతం షేర్లు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ కొనుగోలుదారుల (QIBలు) కోసం రిజర్వ్ చేశారు. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేశారు. IPOలోని 10 శాతం షేర్లు నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.

కంపెనీలో సానుకూలత ఏమిటి
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్, ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ పునీత్ పట్నీ మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ కంపెనీలలో సిర్మా SGS టెక్నాలజీ లిమిటెడ్ ఒకటి. కంపెనీ అనుభవజ్ఞులైన మేనేజ్‌మెంట్ బృందాన్ని కలిగి ఉంది. R&D ఆవిష్కరణలపై కంపెనీ దృష్టి సారిస్తుంది. కంపెనీ వ్యాపార నమూనా ఉత్పత్తి కాన్సెప్ట్ డిజైన్‌తో మొదలవుతుందని, పరిశ్రమ యాజమాన్యం ప్రతి విభాగంపై దృష్టి పెడుతుందన్నారు. సంస్థ వ్యాపారం వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇష్యూ ధర ప్రీమియం వాల్యుయేషన్‌లో ఉంది. అయినప్పటికీ కంపెనీ వృద్ధి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సహేతుకమైనది.

Follow Us:
Download App:
  • android
  • ios