Asianet News TeluguAsianet News Telugu

సర్జికల్ స్ట్రైక్స్ ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ పాక్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. 

surgical strike effect on stock market
Author
Hyderabad, First Published Feb 26, 2019, 10:23 AM IST

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ పాక్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. మంగళవారం ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 90పాయింట్లు పతనమైంది. అయితే వెంటనే కోలుకొని నష్టాలను246 పాయింట్లకు తగ్గించుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 35,952వద్ద ఉంది. నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 10801 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి.

ఎస్‌బీఐ  సహా కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, యస్‌బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు అన్ని బ్యాంకు షేర్లు నష్టపోతున్నాయి. హీరో మోటో, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, వేదాంతా, అదానీ పవర్‌,  టైటన్‌ , సన్‌ ఫార్మ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, డిష్‌ టీవీ భారీగా  నష్టతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు కరెన్సీ బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. టీసీఎస్‌2 శాతం లాభంతో  52వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ కూడా లాభపడుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios