ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..ఈపీఎఫ్‌వో చేసిన అప్పీల్‌ను తిరస్కరిచింది. దీంతో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందనుంది. 

ఇంతకీ మ్యాటరేంటంటే... పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎఫ్‌వో దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో రూ.15,000 ప్రాతిపదికన పెన్షన్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. 

సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది. అదేసమయంలో ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గొచ్చు. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది. పెన్షన్ అధిక మొత్తంలో వస్తుండటంతో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.