Asianet News TeluguAsianet News Telugu

Stocks To Buy: రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్ల నుంచి లాభం పొందాలని ఉందా, ఈ రికమండేషన్స్ పై ఓ లుక్కేయండి..

స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ల నుంచి లాభాలను పొందాలని చూస్తే, షేర్ ఖాన్ బ్రోకరేజీ ఏజెన్సీ టాప్ 5 స్టాక్స్ రికమండ్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Stocks To Buy Do you want to profit from record high stock markets take a look at these recommendations
Author
First Published Dec 1, 2022, 9:04 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తున్నాయి. వరుసగా 8వ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ నిఫ్టీలు జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు  కంపెనీల కార్పొరేట్ అభివృద్ధి ఆధారంగా చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. బ్రోకరేజ్ హౌస్ షేర్‌ఖాన్ 5 క్వాలిటీ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలని రికమండేషన్స్ ఇచ్చింది. ఈ స్టాక్స్‌లో 27 శాతం వరకు బలమైన రాబడిని చూడవచ్చు.

HDFC బ్యాంక్: HDFC బ్యాంక్ స్టాక్‌పై కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ రికమండ్ చేసింది. . ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1800గా నిర్ణయించింది. డిసెంబర్ 1, 2022న షేర్ ధర రూ.1608. ఈ విధంగా, పెట్టుబడిదారులు ప్రతి షేరుకు రూ. 192 లేదా 12 శాతం రాబడిని పొందవచ్చు.

దివీస్ ల్యాబ్:  దివీస్ ల్యాబ్ స్టాక్‌పై కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ రికమండ్ చేసింది. . ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.3975 గా నిర్ణయించింది. డిసెంబర్ 1, 2022న, షేర్ ధర రూ.3405. ఈ విధంగా, పెట్టుబడిదారులు షేరుకు రూ. 570 లేదా దాదాపు 17 శాతం రాబడిని పొందవచ్చు.

టాటా మోటార్స్: టాటా మోటార్స్ స్టాక్‌పై కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ రికమండ్ చేసింది. . ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.516గా నిర్ణయించింది. డిసెంబర్ 1, 2022న షేర్ ధర రూ.439. ఈ విధంగా, పెట్టుబడిదారులు షేరుకు రూ. 77 లేదా దాదాపు 18 శాతం రాబడిని పొందవచ్చు.

ఏషియన్ పెయింట్స్: ఏషియన్ పెయింట్స్ స్టాక్‌పై కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ రికమండ్ చేసింది. . ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.3689గా నిర్ణయించింది. డిసెంబర్ 1, 2022న, షేర్ ధర రూ.3175. ఈ విధంగా, పెట్టుబడిదారులు షేరుకు రూ. 514 లేదా దాదాపు 16 శాతం రాబడిని పొందవచ్చు.

గ్లాండ్ ఫార్మా: గ్లాండ్ ఫార్మా స్టాక్‌పై కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ రికమండ్ చేసింది. . ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.2260గా నిర్ణయించింది. డిసెంబర్ 1, 2022న, షేర్ ధర రూ.1780. ఈ విధంగా, పెట్టుబడిదారులు షేరుకు రూ. 480 లేదా దాదాపు 27 శాతం రాబడిని పొందవచ్చు. 

( నోట్: పైన పేర్కొన్న స్టాక్ రికమండేషన్స్ పెట్టుబడి సలహా కాదు, మీ పెట్టుబడులకు ఏషియానెట్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.  పెట్టుబడి పెట్టే ముందు, ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

Follow Us:
Download App:
  • android
  • ios