బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఈ రోజు సెన్సెక్స్ 52,125 పాయింట్లతో ప్రారంభమైంది. మార్కెట్ ముగిసే సమయానికి 872 పాయింట్లు లాభపడి 53,823 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు నిఫ్టీ తొలిసారిగా పదహారువేల మార్క్‌ను దాటింది.
నేడు రెండవ ట్రేడింగ్ రోజున అంటే మంగళవారం స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 872.73 పాయింట్ల లాభంతో (1.65 శాతం) 53,823.36 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 245.60 పాయింట్ల (1.55 శాతం) లాభంతో 16,130.75 వద్ద ముగిసింది. గత వారం బిఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 388.96 పాయింట్లు (0.73 శాతం) పడిపోయింది.
ఈ రోజు సెన్సెక్స్‌లో 526 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను చూడగా, 218 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ పొందాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ సూచీలు కూడా పెరిగాయి. కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు దేశీయ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, టిసిఎస్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ల పెరుగుదల స్టాక్ మార్కెట్ పెరగడానికి దారితీసింది.
మెరుగుపరుస్తున్న మాక్రో ఆర్థిక డేటా నుండి మార్కెట్ మద్దతు పొందింది. జూలై 2021లో జిఎస్‌టి సేకరణ రూ .1.16 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఆర్థిక వ్యవస్థ కోలుకునే ఆశలను పెంచింది. ప్రధాన రంగ ఉత్పత్తి జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 8.9 శాతం పెరిగింది.
అంతేకాకుండా భారతదేశ ఎగుమతుల సంఖ్య కూడా వార్షిక ప్రాతిపదికన మెరుగుపడింది. విశ్లేషకుల ప్రకారం, ఈ వారం కంపెనీల త్రైమాసిక ఫలితాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం స్టాక్ మార్కెట్ దిశను నిర్ణయిస్తుంది. దీనితో పాటు, ప్రపంచవ్యాప్త ధోరణి, కరోనా వాక్సినేషన్ ద్వారా షేర్ మార్కెట్ ప్రభావితమవుతుంది.
అప్పుల ఊబిలో ఉన్న వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్లు బిఎస్‌ఇలో 10.30 శాతం క్షీణించి రూ .7.40 కి చేరుకున్నాయి. ట్రేడింగ్ సమయంలో 52 వారాల కనిష్టానికి చేరుకుంది. వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం జూలై 2020 తర్వాత అత్యల్ప స్థాయిలో ట్రేడవుతోంది.
కంపెనీ ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లా కంపెనీలో ప్రమోటర్ వాటాను వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి తెలిపాడు. కంపెనీ మనుగడ కోసం కంపెనీలో తన గ్రూపు వాటాను ఏదైనా ప్రభుత్వం లేదా దేశీయ ఆర్థిక సంస్థకు ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నాట్లు తెలిపారు. దీని తరువాత కంపెనీ షేర్లు నేడు భారీగా పడిపోయాయి.
also read 27 సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై.. అధికారికంగా విడాకులు తీసుకున్న గేట్స్ దంపతులు..
పెద్ద షేర్ల గురించి మాట్లాడితే ఈ రోజు ట్రేడింగ్ తర్వాత టాటా స్టీల్, ఎన్‌టిపిసి, బజాజ్ ఆటో మినహా అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి. వీటిలో టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎం అండ్ ఎం, టిసిఎస్, సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డాక్టర్ రెడ్డి, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్, ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ ఉన్నాయి.
మీరు సెక్టోరల్ ఇండెక్స్‌ని చూస్తే నేడు మీడియా, మెటల్ మినహా అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. వీటిలో ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఐటి, ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్‌యూ బ్యాంకులు, ఫైనాన్స్ సేవలు, రియల్టీ కూడా ఉన్నాయి.
ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 53162.24 స్థాయిలో 211.61 పాయింట్లు (0.40 శాతం), నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో (0.31 శాతం) 15935.24 స్థాయిలో ప్రారంభమయ్యాయి. దీని తర్వాత సెన్సెక్స్-నిఫ్టీ ట్రేడింగ్ సమయంలో అత్యధిక స్థాయికి చేరుకుంది.
స్టాక్ మార్కెట్ సోమవారం ట్రేడింగ్ తర్వాత పెరుగుతూ ముగిసింది. సెన్సెక్స్ 363.79 పాయింట్లు (0.69 శాతం) పెరిగి 52,950.63 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 122.10 పాయింట్ల లాభంతో (0.77 శాతం) 15,885.15 వద్ద ముగిసింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారిగా పదహారు వేల మార్క్‌ని దాటింది. ఈ రోజు ఉదయం 15,951 పాయింట్లతో మార్కెట్ ప్రారంభమయ్యింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో నిఫ్టీ క్రమంగా పైపైకి చేరుకుంటూ పదహారు వేల మార్క్‌ని దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 245 పాయింట్లు లాభపడి 16,130 పాయింట్ల వద్ద ముగిసింది.
కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు, అనుకూలమైన మాక్రో ఆర్థిక డేటా, బలమైన విదేశీ ధోరణి దేశీయ మార్కెట్‌ను సానుకూలంగా ప్రభావితం చేశాయి. అంతేకాకుండా, జూలైలో మెరుగైన అమ్మకాల కారణంగా ఆటో కంపెనీల షేర్లు పెరిగాయి, ఇది మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది.
